మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.  సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మాతగా ఈ మూవీ భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. ఆంగ్లేయులకు ఎదిరించిన మొట్టమొదటి తెలుగు బిడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ‘సైరా నరసింహారెడ్డి ’ సినిమా తీస్తున్నారు.  ఈ మూవీ టీజర్ రిలీజ్ ముంబాయిలో అంగరంగ వైభవంగా లాంచ్ చేశారు.  ఇక టీజర్ చూసిన ప్రతి ఒక్కరికీ రోమాలు నిక్కబొడిచాయని అంటున్నారు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పే వాయిస్ ఓవర్ దుమ్మురేపుతుంది. 

చిరంజీవి యాక్షన్ సీన్లు చూసి అభిమానులు ఎప్పుడు తెరపై చూద్దామా అన్న ఆశతో ఉన్నారు.  నిన్న ఈ టీజర్ తెలుగు, కన్నడ, మాళియాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు.  అన్ని భాషల్లో టీజర్ కి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. అంతా బాగుంది కానీ, బాలీవుడ్ లో సైరాకు కష్టాలు వచ్చేలా ఉన్నాయని కొంత మంది సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.  వాస్తవానికి బాలీవుడ్ మెగాస్టార్ కి మంచి క్రేజ్ ఉంది.

రాంచరణ్ కూడా బాలీవుడ్ లో ఓ మూవీలో నటించాడు. అయితే ఇబ్బంది ఎక్కడా అని అనుకుంటున్నారా?  అదే రోజున సూపర్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌, సెన్సేషనల్‌ స్టార్‌ టైగర్‌ ప్రాఫ్‌ హీరోలుగా రూపొందుతున్న భారీ బడ్జెట్‌ మూవీ 'వార్‌' కూడా సైరా విడుదల రోజైన అక్టోబర్‌ 2నే రిలీజ్‌ కానుంది.  బాలీవుడ్ లో ఈ ఇద్దరు హీరోలకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఓ డబ్బింగ్ మూవీకి అంత ప్రాధాన్యత ఆడియన్స్ ఇస్తారా అన్న విషయంపై మల్లగుల్లాలు పడుతున్నారట. ఎక్సెల్‌ ఎంటర్టెన్మెంట్స్‌ , ఫర్హాన్‌ అక్తర్‌ కలిసి ఈ సినిమా హిందీ డబ్బంగ్‌ హక్కులను భారీ రేట్‌ కు కొనుగోలు చేశారు.

ఇప్పటికే బాలీవుడ్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హృతిక్‌ మరియు టైగర్‌ ఫ్యాన్స్‌ లో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలున్నాయి. ఈ రెండు మూవీస్ రిలీజ్ అయ్యే సమయానికి ఒకరకంగా కొంతవరకు  థియేటర్స్‌ సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో సైరా సినిమా విషయంలో జాగ్రత్తగా బిజినెస్ ప్లాన్ చేయాలని, ప్రచారాన్ని కూడా గట్టిగా చేయాలనీ ఎక్సెల్ ఎంటర్టెన్మెంట్స్‌ ప్లాన్ చేస్తోందని చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: