ఆగస్టు 30 సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన రోజు. ఆరోజు ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ సాహో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 450 కోట్ల వరకు బిజినెస్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతోందన్న టాక్ ఇండస్ట్రీలో అందరిని ఆసక్తి రేపుతోంది. ఇది కేవలం టాలీవుడ్ హిస్టరీలోనే కాదు.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ముందెన్నడూ కని వినీ ఎరగని విషయం.

అందుకే సాహో రిలీజ్ అవుతున్న సమయంలో ఇంకొక సినిమా ఏదీ రిలీజ్ కావడం లేదు. దక్షిణ భారతదేశంతో పాటు ఉత్తరభారత దేశంలోనూ సాహో అత్యంత భారీగా రిలీజ్ అవుతోంది. ఈ నెల 30న సాహో వస్తోంది కాబట్టి హిట్ అన్న టాక్ వస్తే ఇక ఆ తర్వాత దాదాపు మూడు వారాల పాటు మిగతా సినిమాల రిలీజ్ కు డేట్స్ ఎవరికీ దొరకవన్న కంగారు ఇతర నిర్మాతల్లో కనిపిస్తోందట. అందుకే సాహో కంటే వారం ముందు చాలా సినిమాలు వరుసగా ఏదో పండగ సీజన్ వచ్చినట్టుగా థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి.

ఒక్కసారిగా పది సినిమాలు రిలీజ్ అవనున్నాయా అన్న సందేహం కలగొచ్చు. ఎందుకంటే సాహో ముందు ఇంకేదీ కనిపించకపోవడమే అందుకు ముఖ్య కారణం. ఆ క్రేజు ముందు వేరే సినిమాలొస్తున్నాయి అన్న సంగతి కూడా ఎవరికీ తెలియడం లేదు. అయితే మొత్తంగా పది సినిమాలు ఈ శుక్రవారం (ఆగస్టు 23) రిలీజైపోతున్నాయని లేటెస్ట్ న్యూస్. వీటిలో కాస్త ఐశ్వర్య ధనుష్ నటించిన కౌశల్య కృష్ణమూర్తి ఉన్నట్టు తెలిసింది. 

కేఎఫ్ సీ వాళ్లు తీసిన 'ఏదైనా జరగవచ్చు' ప్రచారానికి కొత్తగా ప్లాన్ చేస్తున్నారట. ఇక మిగతా సినిమాలేవో ఎవరికీ తెలీదు. ఏదైనా జరగవచ్చు- నేనే కేడీ నంబర్ 1-  జిందా గ్యాంగ్- బాయ్- ఉండి పోరాదే- నివాసి- నీతోనే హాయ్ హాయ్- కనులు కనులు దోచేనే- హవా.. అంటూ చిన్న సినిమాలన్నీ రిలీజ్ కి  23వ తేదీని ఫిక్స్ చేసుకున్నాయి. అయితే ఆగస్టు 30న విడుదల అవుతున్న సాహో ఫీవర్ లో ఉన్న ప్రేక్షకులు అసలీ చిన్న సినిమాలను పట్టించుకుంటారా..అనేది ఇప్పుడు మిలియన్ డాలర్స్ ప్రశ్నగా మారింది. మొత్తానికి సాహో ముందు వారం ముందుగా వస్తున్న 10 సినిమాలు దిగదుడుపేననిపిస్తుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: