టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీజగన్నాద్.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకుని ఫామ్ లోకి వచ్చాడు. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో అయన నెక్స్ట్ సినిమాను అప్పుడే మొదలుపెట్టాడు. తన తదుపరి చిత్రాన్ని టాలీవుడ్ యువసంచలనం విజయ్ దేవరకొండతో తీస్తున్నట్టు ప్రకటించాడు. ఇండస్ట్రీలోనే అత్యంత స్పీడ్ గా సినిమాలు తీయగల పూరి జగన్నాద్ నెక్స్ట్ సినిమా విషయంలో కూడా అదే స్పీడ్ ని కొనసాగించనున్నాడు.


విజయ్ తో పూరి చేయబోయే సినిమాకు సంబంధించి అప్పుడే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి.ఇదిలావుంటే.. డియర్ కామ్రేడ్ సినిమా ఫలితంతో కాస్త నిరాశలో ఉన్న విజయ్ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అందుకే అయన పూరి జగన్నాద్ తో సినిమాకు రెడీ అయ్యాడు. అయితే, విజయ్ ఇప్పటికే క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు తమిళ దర్శకుడితో హీరో అనే మరో సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమాల షూటింగ్ ఓ వైపు జరుగుతుండగానే.. విజయ్ పూరి సినిమా కోసం రెడీ అయ్యాడు.


తాజగా విజయ్, పూరి ఇద్దరు కలిసి కొన్ని ప్రాంతాలు తిరిగి సినిమా  లొకేషన్స్ ని పరిశీలించారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.ఇకపోతే విజయ్.. ప్రస్తుత రెండు సినిమాల షూటింగ్స్ వచ్చే నెలతో పూర్తీ చేస్తాడని.. ఆ తరువాత నవంబర్ నుండి పూరి సినిమా మొదలు అవుతుందని సమాచారం. పూరి  స్టయిల్ లో తెరకెక్కే ఈ సినిమాలో విజయ్ ఎలా కనిపిస్తాడా అన్న ఆసక్తి అతని అభిమానుల్లో నెలకొంది. షూటింగ్ కూడా త్వరలోనే పూర్తి చేసి ఏప్రిల్ లో సినిమా విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్నాడట దర్శకుడు పూరీ జగన్నాధ్. కాబట్టి త్వరలోనే ఈ సినిమాకు సంబందించి అఫిషియల్ గా వివరాలు వెల్లడయ్యే అవకాశం వుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: