టాలీవుడ్ మెగా ప్రిన్స్ గా పేరుగాంచిన వరుణ్ తేజ్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ వాల్మీకి. కొన్నాళ్ల క్రితం తమిళ్ లో సూపర్ హిట్ కొట్టిన జిగర్తాండ అనే సినిమాకు అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మంచి మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహర్షి భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా తమిళ నటుడు అధర్వ ఒక మెయిన్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ యూట్యూబ్ లో రిలీజ్ అయి, 

మెగా ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ సంపాదించింది. తన కెరీర్ లో ఇప్పటివరకు పోషించని ఒక మంచి మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్న వరుణ్ తేజ్, టీజర్ లో పలికిన డైలాగ్స్ అదరగోట్టాయి అనే చెప్పాలి. ఇకపోతే నేడు ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ గా జర్ర జర్ర అనే పల్లవితో సాగె మాస్ లిరికల్ సాంగ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. బ్యూటిఫుల్ హీరోయిన్ డింపుల్ హయతి ప్రత్యేకంగా చిందేస్తున్న ఈ సాంగ్ లో ఆమెతో కలసి వరుణ్ తేజ్, అధర్వ ఆడిపాడనున్నారు. మిక్కీ జె మేయర్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ సాంగ్ ని భాస్కర్ భట్ల రచించగా, అనురాగ్ కులకర్ణి మరియు ఉమా నేహా ఎంతో అద్భుతంగా ఆలపించడం జరిగింది. 

ఇక ఈ సాంగ్ రిలీజ్ తరువాత సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి అనే చెప్పాలి. ఇక ఈ సాంగ్ ఫుల్ వీడియోని రేపు రిలీజ్ చేయనన్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట అత్యంత భారీగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఫోటోగ్రఫీని ఆయనంక బోస్ అందిస్తుండగా, ఎడిటింగ్ ని చోట కె ప్రసాద్, ఆర్ట్ ను అవినాష్ కొల్లా అందిస్తున్నారు. అయితే మన తెలుగు నేటివికి తగ్గట్లు కొంత మార్పులు చేర్పులతో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చేనెల 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: