విజయ్ దేవరకొండ-మైత్రీ మూవీస్ కాంబినేషన్ లో రూపొందిన సినిమా డియర్ కామ్రేడ్. విజయ్ దేవరకొండకున్న క్రేజ్ తో ఒకేసారి నాలుగు భాషల్లో ఈ సినిమా మాంచి హైప్ తో విడుదలయింది. విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న ఆల్రెడి గీత గోవిందం తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో డియర్ మీద కూడా భారీ అంచనాలు వెలువడ్డాయి. అంతేకాదు ఈ సినిమాకు ప్రమోషన్స్ కోసం విజయ్ ఎంత చేయాలో అంతా చేశాడు. కానీ ఆశించిన ఫలితం సాధించడంలో విఫలమైంది. మొదటి షో నుండే స్లోగా ఉందని, లెంగ్త్ బాగా ఎక్కువని ఇలా రకరకాల కామెంట్స్ వచ్చాయి. తర్వాత రోజు నుండే సినిమా మీద బాగా నెగిటివ్ టాక్ వచ్చేసింది. ఫలితంగా సినిమా భారీ నష్టాలను మిగిల్చింది. దీంతో బయ్యర్లు చాలా పోగుట్టున్నారు. అందుకే బయ్యర్లను ఆదుకునే కార్యక్రమాన్ని మైత్రీ మూవీమేకర్స్ స్మూత్ గా ఫినిష్ చేసినట్లు తాజా సమాచారం.

వాస్తవానికి డియర్ కామ్రేడ్ మరీ ఎక్కువ ఫ్యాన్సీ రేట్లకు అమ్మలేదు. చెప్పాలంటే మైత్రీ రెగ్యులర్ బయ్యర్లకు చాలా రీజనబుల్ రేట్లకే ఇచ్చారు. అందువల్ల మరీ ఎక్కువగా వెనక్కు ఇవ్వాల్సిన పరిస్థితి ఏమీలేదట. కానీ తమవైపు తప్పు వుండకూడదని, మైత్రీ జనాలు ఎవరికి వారికి నష్టపోయిన దాంట్లో యాభైశాతం వరకు సర్దుబాటు చేసినట్లు తెలుస్తోంది.

నిజానికి వరుసగా సినిమాలు తీసే నిర్మాతలు ఇలా వెనక్కు ఇవ్వరు. తరువాత సినిమాలో చూసుకుందాం అని నైస్ గా సర్ధి చెప్పి తప్పించుకుంటారు. అయితే ఇటీవల టాలీవుడ్ లో ఇలా తరువాత అని కాకుండా, ఎప్పటికప్పుడు ఇచ్చేసి, క్లియర్ చేసుకుంటున్నారు. అజ్ఞాతవాసి సినిమా నుండి ఇలానే జరుగుతుంది. మైత్రీ సంస్థ ఆ బ్యానర్ మీద నిర్మించిన సవ్యసాచి సినిమాకి కూడా ఇలాగే బయ్యర్లకు సర్దుబాటు చేసింది. ఇప్పుడు కామ్రేడ్ కు కూడా అదే పద్దతి పాటించారు. నిజంగా ఇలాంటి నిర్మాణ సంస్థలుంటే ఎవరు పెద్దగా నష్టపోవాల్సిన పరిస్థితి ఉండదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: