మెగాస్టార్ బర్త్ డే వేడుకలు ఈరోజు అంగరంగ వైభవంగా జరిగాయి.  ఈ వేడుకల్లో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.  ఇలా ఒక పబ్లిక్ మీటింగ్ లో పవన్ పాల్గొనడం విశేషం.  అయితే, ఈవేడుకల్లో పవన్ తో పాటు రామ్ చరణ్, మిగతా మెగా హీరోలు కూడా ఈ వేడుకల్లో పాల్గొంటారని అనుకున్నారు.  


కానీ, మెగా హీరోల్లో కొందరు మాత్రమే పాల్గొనడం విశేషం.  ఈ వేడుకల్లో కేక్ కట్ చేయడానికి ముందు... జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు మెమొంటో అందజేశారు.  జనసేన ఎమ్మెల్యే ప్రజల కోసం చేసిన మంచి పనులకుగాని ఈ అవార్డుకు అందజేశారు.  ఒక ఎమ్మెల్యేకు కాకుండా, సైరా నరసింహారెడ్డి.. సినిమా అన్నది ఒక చారిత్రాత్మక సినిమా కాబట్టి, స్వాతంత్ర సమయంలో పాల్గొన్న ఓ వ్యక్తికి సన్మానం చేస్తే బాగుండేది.  


కేవలం జనసేన పార్టీని ప్రమోషన్స్ చేసుకోవడానికి ఈ పార్టీని వినియోగించుకున్నట్టు తెలుస్తోంది.  గత ఎన్నికల్లో మెగాస్టార్ అభిమానులు జనసేన పార్టీకి దూరంగా ఉన్నారు.  ఆ దూరాన్ని తగ్గించుకోవడానికి, మెగాస్టార్ అభిమానులకు దగ్గర కావడానికి ఈ వేదిక ఒక సాధనంగా మారింది.  మెగాస్టార్ గురించి పవన్ కళ్యాణ్ చాలా గొప్పగా స్పీచ్ ఇచ్చారు.  తనకు అత్యంత ఇష్టమైన స్ఫూర్తినిచ్చిన వాళ్లలో మెగాస్టార్, అమితాబ్ లు ఇద్దరు ఉన్నారని పవన్ చెప్పడం విశేషం.  


మెగాస్టార్ చిరంజీవి తనను మూడు సార్లు కాపాడారని అన్నారు.  ఇంటర్ చదివే రోజుల్లో ఫెయిల్ అయినపుడు తాను డిప్రెషన్ కు గురయ్యానని, ఆ సమయంలో అన్నయ్య చిరంజీవి చెప్పిన మాటలు స్ఫూర్తి ని ఇచ్చాయని చెప్పారు.  అదే విధంగా దేశం గురించి ఎక్కువ ఆలోచించే సమయంలో తనను ఓసారి కాపారని, యోగా, మెడిటేషన్ చేసే సమయంలో మరోసారి కాపాడారని అన్నారు.  ఆ మూడుసార్లు కాపాడిన సమయంలో మెగాస్టార్ చూపిన మాటలు తనను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చాయని చెప్పారు.  కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థ నుంచి సైరా సినిమా రావడం చాలా సంతోషంగా ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: