బుల్లితెర మీద ఏ షోలో చూసినా అలరిస్తున్న జంట సుడిగాలి సుధీర్, రష్మి గౌతం. జబర్దస్త్ వరకే ఉన్న వీరి హంగామా ఢీ షో ద్వారా ఇంకాస్త ఎక్కువైంది. జబర్దస్త్ లో అయినా రష్మి యాంకర్.. సుధీర్ కంటెస్టంట్ గా ఉంటాడు.. కాని ఢీలో ఇద్దరు టీం లీడర్స్ కావడం వల్ల ఇద్దరు కలిసి స్కిట్స్ చేయాల్సి ఉంటుంది.


ఢీ షోలో సుధీర్, రష్మిల మధ్య వచ్చే ఎపిసోడ్ అంతా స్క్రిప్ట్ అన్న విషయం అందరికి తెలిసిందే. సుధీర్, రష్మి కెంసిట్రీ వర్క్ అవుట్ అవడం వల్ల అదే కొనసాగిస్తూ ఉన్నారు డైరక్టర్స్. సుధీర్ రష్మి వెంట పడటం ఆమె అతన్ని కాదనడం ఇలానే అన్ని ఎపిసోడ్స్ వస్తుంటాయి. షో చూసే ఆడియెన్స్ మాత్రం నిజంగానే సుధీర్ కు రష్మి అంటే అంత ఇష్టమేమో అనుకుంటారు. 


అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుధీర్ రష్మి గురించి ఓ క్లారిటీ ఇచ్చాడు. తను కేవలం షోలో భాగంగా రష్మితో క్లోజ్ గా ఉంటాను తప్ప బయట తనకు రష్మికి చాలా ఏజ్ గ్యాప్ ఉందని అన్నాడు సుధీర్. అంతేకాదు తమని జోడీగా చూపించడం వల్ల షోకి మంచి రేటింగ్ వస్తుందని ప్రోగ్రాం డైరక్టర్స్ అలా స్క్రిప్ట్ రాయిస్తున్నారని అన్నాడు. 


ఇక ఈమధ్య తనకు పెళ్లి సంబంధాలు వస్తుండగా రష్మి గురించి తన పేరెంట్స్ ను అడుగుతున్నరని.. అది కేవలం షో వరకే అని.. షోలో తనని అమ్మాయిల పిచ్చోడిగా చూపిస్తారని అదంతా షో వరకే పరిమితమని అన్నాడు సుధీర్. తాను ఓ లవ్ ఫెయిల్యూర్ అని అందుకే బయట పెద్దగా అమ్మాయిలతో మాట్లాడటానికి కూడా ఇష్టపడనని అన్నాడు సుధీర్. ఈమధ్యనే సుధీర్ హీరోగా సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా స్టార్ట్ చేశారు. ఆ సినిమా రిలీజ్ ఎప్పుడన్నది తెలియాల్సి ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: