మెగా స్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఫంక్షన్ నిన్నరాత్రి శిల్పకళా వేదికలో అత్యంత కోలాహలంగా జరిగింది. ఎన్నికలలో ఓడిపోయిన తరువాత మెగా అభిమానులు ఏర్పాటు చేసిన సమావేశంలో పవన్ పాల్గొనడం ఇదే మొదటిసారి కావడంతో పవన్ ఏమి మాట్లాడుతాడు అన్నఆశక్తి మెగా అభిమానులలోనే కాకుండా మీడియా వర్గాలలో కూడ బాగా ఉండటంతో పవన్ చేసిన కామెంట్స్ కు మీడియా విపరీతమైన ప్రచారాన్ని ఇచ్చింది.

తన సహజసిద్ధమైన ఆవేశధోరణితో కాకుండా చిరంజీవి తనకు ఎలాస్ఫూర్తిని ఇచ్చాడు అన్నవిషయాల పై పవన్ ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. తాను ఇంటర్ పరీక్షలలో ఫెయిల్ అయినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు జీవితం అంటే ఒకపరీక్షలు మాత్రమే కాదు అంటూ తనకు చెప్పి ధైర్యం కల్గించిన చిరంజీవి గురించి మాట్లాడుతూ అలాంటి అన్నయ్యలు ప్రతి ఇంటిలోనూ ఉంటే ఇంటర్ పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకోరు అంటూ కామెంట్స్ చేసాడు.

అదేవిధంగా తనకు చిన్నప్పటి నుండి దేశం అన్నా సమాజం అన్నా విపరీతమైన ప్రేమ అనీ చెపుతూ ఎవరైనా దేశం గురించి అవహేళనగా మాట్లాడితే ఆవేశంతో ఊగిపోయేవాడినని చెపుతూ అప్పట్లో తన ఆవేశాన్ని చూసి ఖంగారు పడ్డ చిరంజీవి తన ప్రవర్తన పై ఖంగారు పడి కులం మతం మించి మానవత్వం ఉంటుంది అంటూ తన ఆవేశాన్ని చల్లార్చిన అప్పటి సంఘటనలను గుర్తుకు చేసుకున్నాడు. ఇదే సందర్భంలో తనకు 22 సంవత్సరాల వయసులో తాను తిరుపతి వెళ్లి అక్కడి యోగాశ్రామంలో ఉండిపోయి సన్యాసిగా మారిపోవాలని ప్రయత్నించినప్పుడు ఇంటి బాధ్యతలు పట్టించుకోకుండా ఇలా యోగిగా మారిపోతే స్వార్ధ పరుడిగా మిగిలిపోతావు అంటూ చిరంజీవి చేసిన జ్ఞాన భోధవల్ల తాను సన్యాసి కాకుండా ఆగిపోయాను అంటూ తన జీవితాన్ని ఇలా మూడు సార్లు ప్రభావితం చేసిన చిరంజీవి పై ప్రశంసలు కురిపించాడు పవన్.

ఇప్పటి వరకు ఎన్నోసార్లు చిరంజీవి పుట్టినరోజు వేడుకలు జరిగినా ఆఖరికి చిరంజీవి షష్టిపూర్తి వేడుకల సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన సభకు కూడ దూరంగా ఉన్న పవన్ ఇప్పుడు తన మనసు మార్చుకుని ఇలా మెగా అభిమానులతో కలిసిపోతు తన అన్నను పొగుడ్తూ చేసిన ఉపన్యాసం వెనుక భారీ స్కెచ్ ఉంది అన్న ప్రచారం జరుగుతోంది. ఎన్నికలలో ఓటమి తరువాత జనసైనికులలో చాల తీవ్ర నిరాశ నెలకొని ఉంది. ఈ నిరాశ నుండి జనసైనికులకు స్ఫూర్తిని ఇచ్చి వారి వెంట మెగా అభిమానుల అండదండలు ఉన్నాయి అంటూ పరోక్ష సందేశం ఇవ్వడానికి పవన్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను చాల తెలివిగా ఉపయోగించుకున్నాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: