రాబోతున్న సంక్రాంతి రేస్ మహేష్ అల్లు అర్జున్ సినిమాల మధ్య వార్ గా మారుతుందని క్లారిటీ రావడంతో అందరు ఈ సంక్రాంతి రేస్ ఫలితం గురించి అప్పుడే అంచనాలు మొదలుపెట్టేశారు. అయితే ఈ రేస్ కు రాబోతున్న ఈ భారీ సినిమాల తాకిడిని లెక్క చేయకుండా మీడియం రేంజ్ హీరోల సినిమాల విడుదల తేదీలను కూడ సంక్రాంతి రేస్ కు అనుగుణంగా మార్చడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.  

శర్వానంద్ కళ్యాణ్ రామ్ సాయిధరమ్ నాగచైతన్య లాంటి మీడియం రేంజ్ హీరోల సినిమాలు అన్నీ ఇప్పుడు సంక్రాంతి రేసును టార్గెట్ చేసే విధంగా తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. ఇప్పటికే కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ‘ఎంత మంచివాడవురా’ మూవీని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. 

అంతేకాదు శర్వానంద్ హీరోగా నటిస్తున్న ‘శ్రీకారం’ మూవీని కూడ సంక్రాంతి రేస్ లో విడుదల అయ్యే విధంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ ‘ప్రతి రోజు పండగే’ మూవీ కూడ సంక్రాంతికి రిలీజ్ చేసే విధంగా విడుదల చేయడానికి మారుతి ఆ మూవీని వేగంగా పరుగులు తీయిస్తున్నాడు. 

ఇది చాలదు అన్నట్లుగా నాగచైతన్య మూవీ కూడ సంక్రాంతి రేసులో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. దీనితో ‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురంలో’ మూవీలతో పాటు రజినీకాంత్ ‘దర్బార్’ విడుదల కాబోతున్న సంక్రాంతి పండుగ రేసులో ఈ మీడియం రేంజ్ సినిమాల హడావిడి ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపడుతున్నాయి. భారీ సినిమాలకే ధియేటర్లు దొరకని సంక్రాంతి సీజన్ లో ఈ చిన్న సినిమాలకు ధియేటర్లు ఎక్కడ దొరుకుతాయి అంటూ కామెంట్స్ రావడమే కాకుండా సంక్రాంతి సీజన్ లో ఈ చిట్టెలుకల హడావిడి ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో జోక్స్ పడుతున్నాయి..   



మరింత సమాచారం తెలుసుకోండి: