బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం "ఆర్ ఆర్ ఆర్". ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా బాహుబలి ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి తన నెక్స్ట్ సినిమా ఏ బాలీవుడ్ తారలతోనో ఉంటుందని అనుకున్నారు. ఒకానొక టైంలో ఆమీర్ ఖాన్ తో సినిమా చేస్తాడనే వార్తలు వచ్చాయి. కానీ వాటన్నింటిని అబద్ధం  చేస్తూ రాజమౌళి తన సినిమాని ప్రకటించేశాడు.


అయితే రాజమౌళి తీస్తున్న ఈ మల్టీ స్టారర్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటిస్తుండగా, రామ్ చరణ్ కి జోడీగా ఆలియ భట్ ని తీసుకున్నారు. ఎన్టీఆర్ సరసన బ్రిటీష్ భామ అయిన డైసీ ఎడ్గార్ జోన్ నటించాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుండి తప్పుకుంది. అయితే అప్పటి నుండి ఎన్టీఆర్ సరసన ఎవరు నటిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.


మధ్యలో చాలా మంది పేర్లు వినిపించాయి. కానీ అఫిషియల్ గా ఎటువంటి ప్రకటన రాలేదు. ఇప్పటికీ దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అయితే  డైసీ మోర్గాన్ స్థానంలో హాలీవుడ్ బ్యూటీ ఎమ్మా రాబర్ట్స్‌ పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.హాలీవుడ్ బ్యూటీ ఎమ్మా రాబర్ట్స్‌ విషయమై రాజమౌళి నుంచి ఇప్పటిదాకా ఎలాంటి అఫీషియల్ మెసేజ్ రానప్పటికీ.. మరికొద్ది రోజుల్లోనే ఎన్టీఆర్ హీరోయిన్ ఎవరనేది ఆయన ప్రకటించబోతున్నారని తెలుస్తోంది.


బ్రిటీష్ కాలం నాటి పరిస్థితులకు అనుగుణంగా ఎన్టీఆర్ కోసం తెల్లమ్మాయినే కన్ఫర్మ్ చేయనున్నారట జక్కన్న. అయితే ఆమె ఎవరు అనేది నెక్స్ట్ షెడ్యూల్‌కి అఫీషియల్ సమాచారం ఇవ్వనున్నారట. ప్రస్తుతం బల్గేరియాలో షూటింగ్ జరుపుకుంటున్న ఆర్ ఆర్ ఆర్ టీం నెక్స్ట్ షెడ్యూల్ వరకి హీరోయిన్ ఎవరనేది చెప్పేస్తారట. మరి రాజమౌళి సినిమాలో నటించే అదృష్టం ఏ అమ్మడు దక్కించుకోనుందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: