ఫిలిం ఇండస్ట్రీలో చాల విచిత్రమైన సెంటిమెంట్లు ప్రచారంలోకి వస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి సెంటిమెంట్ తో ముడిపెట్టి ‘సాహో’ గురించి కొందరు చేస్తున్న కామెంట్స్ చాల ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఈ సెంటిమెంట్ ను ప్రచారంలోకి తీసుకు వస్తున్న వారి అభిప్రాయం ప్రకారం రాజమౌళితో సినిమా చేసే హీరోకు అతడి కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ దక్కుతుంది. 

కానీ ఆ తరువాత వెనువెంటనే చేసే సినిమా మాత్రం ఫెయిల్ అవుతుంది అన్న సెంటిమెంట్ ఇండస్ట్రీ వర్గాలలో ప్రచారంలో ఉంది. రాజమౌళితో చివరగా ‘యమదొంగ’ సినిమాను జూనియర్ చేసిన తరువాత కొన్నాళ్ళపాటు వరుస ఫ్లాపులతో సతమతం అయ్యాడు. ‘యమదొంగ’ ను మించి సినిమా రావడానికి చాలాకాలం పట్టింది.    

రామ్ చరణ్ రాజమౌళితో చేసిన ‘మగధీర’ తరువాత వెంటనే వచ్చిన ‘ఆరెంజ్’ డిజాస్టర్ ఫ్లాప్ గా మారడంతో ఆ ఫ్లాప్ నుండి రికవర్ కావడానికి చరణ్ కు చాలా సమయం పట్టింది. రాజమౌళి తో ‘విక్రమార్కుడు’ తర్వాత కూడ రవితేజ పరిస్థితీ ఇలాగే చాలాకాలం కొనసాగింది. వాస్తవానికి ప్రభాస్ రాజమౌళి తీసిన ‘ఛత్రపతి’ తర్వాత ఆస్థాయి విజయమే దక్కలేదు. అయితే ‘మిర్చి’ నుండి ప్రభాస్ పూర్తిగా ట్రాక్ లోకి వచ్చి నేషనల్ స్టార్ అయిపోయాడు. 

‘బాహుబలి’ సూపర్ సక్సస్ తరువాత ప్రభాస్ నుండి ఏసినిమా రాలేదు. ఇప్పుడు రెండు సంవత్సరాల గ్యాప్ తో ‘సాహో’ వస్తోంది. దీనితో రాజమౌళికి ఉన్న ఒక నెగిటివ్ సెంటిమెంట్ ‘సాహో’ కు శాపంగా మారుతుందా ? అంటూ కొందరు మితిమీరిన అపోహలను ప్రచారంలోకి తీసుకు వస్తున్నారు. వినడానికి ఈ సెంటిమెంట్ ఆసక్తికరంగా ఉన్నా ఈ మూవీని భారీ రేట్లకు కొనుక్కున్న బయ్యర్లకు మాత్రం పీడకలగా మారుతోంది. దీనితో రాజమౌళి సెంటిమెంట్ నిజంగా వర్కౌట్ అయితే తమ పరిస్థితి ఏమిటి అంటూ ‘సాహో’ బయ్యర్లు లోలోపన మధన పడుతున్నట్లు టాక్..    


మరింత సమాచారం తెలుసుకోండి: