టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నేడు తన 64వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. నిన్న ఆయన జన్మదిన వేడుకలను శిల్పకళావేదికలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక అతిథిగా, మెగా ఫ్యామిలీ మెంబెర్స్ మరియు మెగా ఫ్యాన్స్ సమక్షంలో ఎంతో వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది. మొదటి నుండి నేను అన్నయ్యగారిని ఎన్నో విషయాల్లో స్ఫూర్తిగా తీసుకునేవాడినని, అంతటి గొప్ప మనసున్న మెగాస్టార్ కు తమ్ముడిగా పుట్టడం నిజంగా ఆ దేవుడిచ్చిన వరం అంటూ నిన్నటి వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. 

ఇకపోతే మెగాస్టార్ పుట్టినరోజును పురస్కరించుకుని నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మెగాఫ్యాన్స్ రక్త దానాలు, అన్నదానాలు సహా పలు సేవ కార్యక్రమాలు చేపడుతున్నారు. అలానే పలువురు సినిమా ప్రముఖులు కూడా తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఆయనకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇకపోతే టాలీవుడ్ రాక్ స్టార్ గా పేరుగాంచిన దేవిశ్రీప్రసాద్, మెగాస్టార్ కు ఒక వెరైటీ పద్దతిలో బర్త్ డే విషెస్ తెల్పడం జరిగింది. తన ఫోన్ లో సెల్ఫీ వీడియో తీస్తూ, తన మ్యూజిక్ కంపోజింగ్ టీమ్, మరియు కొందరు సింగర్స్ తో కలిసి, శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలోని టైటిల్ సాంగ్ ని పాడుతూ హ్యాపీ బర్త్ డే మెగాస్టార్ అంటూ తన టీమ్ మెంబెర్స్ తో కలిసి మంచి సందడి చేసారు దేవి. 

తనకు ఎంతో ఇష్టమైన మెగాస్టార్ గారు, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, అలానే మొన్న రిలీజ్ అయిన సైరా టీజర్ చూశాను, ఎంతో అదిరిపోయిందని, ఇక త్వరలో రిలీజ్ కాబోయే సైరా సినిమా కూడా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నట్లు దేవి ఆ వీడియోలో తెల్పడం జరిగింది. ఇక దేవి పోస్ట్ చేసిన మెగాస్టార్ బర్త్ డే విషెస్ వీడియో, ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది....!!


మరింత సమాచారం తెలుసుకోండి: