మెగాస్టార్ చిరంజీవి తన 64 వ పుట్టిన రోజుని జరుపుకుంటున్న సందర్భంలో ఆయన సినీ ప్రయాణం గురించి ఎన్నో వార్తలు వస్తున్నాయి.1955 ఆగస్టు 22న జన్మించిన చిరంజీవి 64వ వసంతంలోకి ప్రవేశించారు. తెలుగు పరిశ్రమలో స్వయం కృషితో ఎదిగిన చిరు, ఎన్టీఆర్ తరువాత టాప్ పొజిషన్ దక్కించుకొని దశాబ్ధాలపాటు కొనసాగారు.  అయితే ఒకానొక దశలో తెలుగు తెరపై మకుటం లేని మహరాజులా నిలిచాడు.


ఆయన చెప్పే డైలాగులకి, ఆయన మేనరిజానికి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన వేసిన  స్టెప్పులు ప్రతీ ఒక్కరిని అలరిస్తాయి. అయితే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన సినిమా కెరీర్లో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. దానికంటే ముందు చిరంజీవి తన రెమ్యునరేషన్ లో కోటి రూపాయల మార్క్ ఎప్పుడు దాటాడనేది మరింత ఆసక్తిగా మారింది.


అయితే మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేసిన చిరంజీవి, హీరోగా 1990  ప్ర్రాంతంలో పీక్స్ లో ఉన్నాడు. ఆ టైంలోనే మెగాస్టార్ కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నాడట.అయితే మొట్టమొదటి సారిగా "గ్యాంగ్ లీడర్" సినిమాకి మెగాస్టార్ కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నాడట. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. చిరంజీవి, విజయశాంతి ల హిట్ పెయిర్ కి జనం నీరాజనాలు పట్టారు.
 
1990 ల ప్రాంతంలోనే ఆయన నుండి ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ అయిన కొండవీటి దొంగ, కొదమ సింహం, జగదేకవీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు వంటి చిత్రాలు రావడం జరిగింది. 1992 లో ప్రముఖ ఇంగ్లీష్ మ్యాగజైన్ ది వీక్ చిరు కవర్ పేజీ తో ఓ ఆర్టికల్ ప్రచురించింది. దాని ప్రకారం అప్పట్లోనే చిరు 1.25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునేవారట. ఇది బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ పారితోషకం కంటే ఎక్కువని వారు చెప్పడం జరిగింది.



మరింత సమాచారం తెలుసుకోండి: