టాలీవుడ్ లోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోల్లో ఒకరు రాజ్ తరుణ్.  ఫార్ట్ ఫిలిమ్స్ తీస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేస్ సొంతం చేసుకున్న రాజ్ తరుణ్ ‘ఉయ్యాల జంపాల’సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.  వాస్తవానికి రాజ్ తరుణ్ సినీ పరిశ్రమకు డైరెక్టర్ కావాలని వచ్చినట్టు పలు సందర్భాల్లో తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సమయంలోనే నాగార్జున దృష్టిలో పడటం ‘ఉయ్యాల జంపాల’సినిమాలో హీరోగా ఛాన్స్ రావడం జరిగిందని చెప్పారు.

ఈ సినిమా మంచి విజయం అందుకుంది..ఆ తర్వాత సినిమా చూపిస్తమావా,కుమారి 21 ఎఫ్, ఈడోరకం ఆడోరకం లాంటి సినిమాలు వరుస విజయాలు అందుకున్నాయి. దాంతో రాజ్ తరుణ్ కి మంచి డిమాండ్ పెరిగింది.  కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు వరుసగా ఫెయిల్ అయ్యాయి. ఆ మద్య దిల్ రాజ్ బ్యానర్ లో ‘లవర్’ సినిమా వచ్చింది..కానీ ఇది యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దాంతో కెరీర్ పరంగా ఇబ్బందుల్లో పడ్డాడు రాజ్ తరుణ్.  ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్నరాజ్ తరుణ్ మరో ఇబ్బందుల్లో పడ్డారు. 

రెండు రోజుల క్రితం నార్సింగి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అల్కాపూరి సమీపంలో నటుడు రాజ్ తరుణ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికాగా, ఆ వెంటనే రాజ్ తరుణ్ అక్కడి నుంచి పరిగెత్తుతూ పారిపోయిన సంగతి తెలిసిందే.అయితే ఆటోమేటిక్ గేరు ఉన్న కారు కావడంతో సాంకేతికంగా ఎలా నడపాలో తెలియక.. వేగాన్ని అదుపు చేయలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కారు స్పీడ్ గా వెళ్లి డివైడర్ ఢీ కొట్టడంతో అద్దాలు పగిలిపోయాయి..డ్యామేజ్ కూడా అయ్యింది. అదృష్టం కొద్ది కారులో ఉండే ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ప్రమాదం తప్పింది.

రెండు రోజుల నుంచి మీడియాలో వస్తున్న వార్తలపై రాజ్ తరుణ్ ట్విట్టర్ లో స్పందించారు.  తనకు ఏమీ కాలేదని..క్షేమంగా ఉన్నానని, అయితే కారు నడిపే ముందు సీటు బెల్ట్ పెట్టుకోవడం వల్లనే తాను క్షేమంగా బయట పడ్డానని..కారు, బైక్ నడిపే సమయంలో సురక్ష మార్గాలు పాటించాలని అభిమానులను సూచించారు. అయితే  పోలీసులు రాజ్ తరుణ్ పై కేసు పెట్టారు. విచారణకు రావాల్సిందిగా ఆయనకు ట్విట్టర్ ద్వారా సమాచారాన్ని అందించినట్టు నార్సింగ్ పోలీసు ఇనస్పెక్టర్ రమణ గౌత్ వెల్లడించారు. ఆయనతో మాట్లాడిన తరువాత కేసు విషయంలో ముందుకెళ్లే విషయమై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: