అర్జున్ రెడ్డి సినిమా తరువాత సెన్సేషనల్ హీరో  విజయ్ దేవరకొండ కు తెలుగు రాష్ట్రాల్లో  పాపులారిటీ ఒక్కసారిగా పెరిగిపోయింది.  ముఖ్యంగా యూత్ లో ఆయనకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.  దాంతో  సినిమాల్లో ఆఫర్లే కాదు  కార్పొరేట్ రేట్  కంపెనీలు కూడా విజయ్ ను  ప్రచారకర్త గా నియమించుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నాయి.   అందులో భాగంగా  ఫ్లిప్ కార్ట్ , కేఎల్ఏంఫ్యాషన్ మాల్ , సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ వంటి తదితర బ్రాండ్ లకు  ప్రచార కర్తగా వ్యవహరించిన  విజయ్ తాజాగా  ఫేమస్ ఫుడ్ డెలివరీ యాప్  జొమాటో కు ప్రచార కర్తగా వ్యవహరించనున్నాడు. 


 ఇందుకు గాను విజయ్ కోటి రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నాడని సమాచారం.  ఇక సౌత్ ఇండస్ట్రీ లో  అత్యధిక  బ్రాండ్స్ కు  ప్రచారకర్తగా  వ్యవహరిస్తూ సూపర్ స్టార్  మహేష్ బాబు  రికార్డు సృష్టించారు.  ప్రస్తుతం ఆయన 10బ్రాండ్లకు పైగా ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నారు.  కాగా టాలీవుడ్ హీరోల్లో మహేష్ తరువాత  విజయ్ దేవరకొండ నే అత్యధిక  బ్రాండ్స్ కు ప్రచారం చేస్తున్నాడు.  




ఇక గీత గోవిందం , టాక్సీవాలా సినిమాలతో వరుస విజయాలను చవిచూసిన  విజయ్ ఇటీవల డియర్ కామ్రేడ్ తో ప్రేక్షకులముందుకు వచ్చి భారీ  షాక్ తిన్నాడు. మంచి  అంచనాల మధ్య  విడుదలైన ఈ చిత్రం  ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో  బాక్సాఫీస్ వద్ద  బోల్తా పడి డిజాస్టర్ సినిమాల లిస్ట్ లో చేరింది.  విజయ్ ప్రస్తుతం మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ఫేమ్  క్రాంతి మాధవ్ దర్శకత్వంలో  ఓ చిత్రంలో నటిస్తున్నాడు.  కేఎస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.  ఈసినిమా తరువాత,డ్యాషింగ్ డైరెక్టర్  పూరీజగన్నాధ్ తో ఓ సినిమా చేయనున్నాడు విజయ్. ఈ క్రేజీ కాంబినేషన్ ఫై ఇప్పటినుండే మంచి అంచనాలు మొదలైయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: