ప్రభాస్ నిన్నటి వరకు ముంబాయిలో ఒక్క క్షణం తీరికలేకుండా ‘సాహో’ ను ప్రమోట్ చేస్తూ చాల బిజీబిజీగా కాలం గడిపాడు. అనేక హిందీ ఛానల్స్ నిర్వహించే గేమ్ షోలకు అతిధిగా రావడమే కాకుండా ఆ షోలో పాల్గొంటున్న అనేక మంది అడిగిన కొన్ని చిలిపి ప్రశ్నలకు ప్రభాస్ చాల తెలివిగా సమాధానాలు ఇచ్చాడు. 

ఈ సందర్భంలో ఒక కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రభాస్ కు మళ్ళీ అనుష్కతో పెళ్ళి ఎప్పుడు అంటూ ఒక చిలిపి ప్రశ్న ఎదురైంది అని తెలుస్తోంది. దీనితో కొంత అసహనానికి లోనైన ప్రభాస్ తన అసహనాన్ని బయటపెట్టకుండా ఆ ప్రశ్న అడిగిన షాకింగ్ కామెంట్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

తమ ఇద్దరికీ ఎటువంటి సాన్నిహిత్యం లేదు అని చెపుతున్నా మీడియా పట్టించుకోకుండా కథనాలు వ్రాస్తున్న పరిస్థుతులలో తమ ఇద్దరిలో ఎవరో ఒకరికీ ముందుగా పెళ్ళి అయితేకాని ఈ వార్తలు అదుపులోకిరావు అంటూ జోక్ చేసినట్లు సమాచారం. అంతేకాదు తన పెళ్ళి ఎప్పుడు జరుగుతుందో తనకే తెలియదు కాబట్టి ముందుగా అనుష్కను తనకు నచ్చిన వ్యక్తిని పెళ్ళి చేసుకుని ఈ గాసిప్పులకు చెక్ పెట్టమని అడగాలని ఉంది అంటూ ప్రభాస్ జోక్ చేసాడు.

దీనితో ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న యాంకర్ కు అదేవిధంగా ఆ కార్యక్రమ రికార్డింగ్ లో పాల్గొన్న వారికీ ప్రభాస్ వేసిన జోక్ కు విపరీతంగా నవ్వు తెప్పించినట్లు టాక్. అయితే అనుష్క ప్రభాస్ సూచనను పాటించి ముందుగా ప్రభాస్ కంటే పెళ్ళి చేసుకుని ప్రభాస్ కు లైన్ క్లియర్ చేస్తుందా లేదా అన్నది సందేహం. ‘సాహో’ ప్రమోషన్ జరుగుతున్నంత సేపు ప్రభాస్ ఎక్కడకు వెళ్ళినా అనుష్కతో అతడి సాన్నిహిత్యం గురించి అదేవిధంగా పెళ్ళి గురించి వస్తున్న ప్రశ్నల గురించి ఒక విధంగా ప్రభాస్ కు సమస్యగా మారింది అనడంలో ఎటువంటి సందేహంలేదు..


మరింత సమాచారం తెలుసుకోండి: