బిగ్ బాస్ సీజన్ 3లో మొదటి వారంలోనే హేమ బయటకు వచ్చేందుకు కారణమైన రాహుల్ సిప్లిగంజ్ ఆ తర్వాత హౌజ్ లో సైలెంట్ అయ్యాడు. వారాలు గడుస్తున్నా కొద్ది రాహుల్ టాస్కుల్లో కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదన్న టాక్ వినిపిస్తుంది. లాస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్ లో ఆలి రెజాకు సపోర్ట్ గా ఇంట్లో ఐదారుగురు సభ్యులు ఉండగా వారిని వాధించి పక్కకు తప్పుకోమని చెప్పి కనీసం తన ప్రయత్నం చేయకుండానే రాహుల్ తాను ఓడిపోయినట్టు ఒప్పుకున్నాడు.  


రాహుల్ కు సపోర్ట్ చేస్తున్న వరుణ్ సందేష్, వితిక, పునర్నవిలు ఆ విషయంలో షాక్ అయ్యారు. అందుకే ఈ వీక్ నామినేషన్స్ లో రాహుల్ ను ఉంచారు. ఇదిలాఉంటే బుధవారం జరిగిన టాస్క్ లో కంటెస్టంట్స్ ఎవరికి నచ్చినట్టుగా వారు మిగతా ఇంటి సభ్యులను అలరించాల్సి ఉంటుంది. ఈ టాస్క్ కు శ్రీముఖి, బాబా భాస్కర్ జడ్జులుగా ఉన్నారు.


ఈ టాస్క్ లో కూడా రాహుల్ సింగర్ కాబట్టి పాట పాడుతాడని అనుకున్నారు. అనుకున్నట్టుగా పాట పాడిన రాహుల్ పాటని మధ్యలో శృతి తప్పి సారీ కాన్సెంట్రేషన్ కుదరడం లేదు. కొద్దిగా నర్వస్ గా ఉందని అన్నాడు. రాహుల్ ఇలా చేయడానికి కారణం హౌజ్ లో పునర్నవి మీద ఏర్పడ్డ ఇష్టమే అని కొందరు అంటున్నారు. సింగర్ అయ్యుండి ఇలా పాట పాడుతూ నర్వస్ అనడం ఏంటని శ్రీముఖి రాహుల్ ను ప్రశ్నించింది.   


ఫైనల్ గా కొద్దిపాటి విరామం తర్వాత రాహుల్ మళ్లీ ఆ పాటని అందరిని మెప్పించేలా పాడాడు. పునర్నవితో రిలేషన్ వల్ల రాహుల్ హౌజ్ లో దేని మీద దృష్టి పెట్టలేకపోతున్నాడు అన్నది అందరు అనుకుంటున్న మాట. చూస్తుంటే అది నిజమే అనిపించక తప్పదు. గేం ఆడేందుకు వచ్చిన రాహుల్ ఐదువారాలకే ఇలా సైలెంట్ అవడం పట్ల అతన్ని ఇష్టపడుతున్న వారు ఫీల్ అవుతున్నారు. మరి రాహుల్ ఇప్పటికైనా హౌజ్ లో జోష్ కనబరిస్తే బెటర్ లేదంటే ఎలిమినేట్ అయినా అవుతాడని అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: