ఒకప్పుడు  పూరి జగన్నాథ్ సినిమాలంటే ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు.  అయన సినిమాల కోసం ప్రేక్షకులు క్యూ కట్టేవారు.  క్యూకట్టడమే కాదు.. సినిమాలు కూడా వందరోజులు ఆడేవి.  పూరి సినిమాకు భారీ అభిమానులు ఉన్నారు.  ఇదంతా టెంపర్ ముందు వరకు.  టెంపర్ కు ముందు కూడా కొన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయి.  కానీ,  టెంపర్ సినిమా కోసం ఎన్టీఆర్ ను ఒప్పించి  హిట్ కొట్టాడు.  


ఈ సినిమా హిట్ కావడంతో పూరి మరలా లైన్లోకి వచ్చారని అనుకున్నారు.  అయితే, ఆ సినిమా తరువాత వరసగా ప్లాప్ అయ్యాయి.  అలా సినిమాలు వరసగా ప్లాప్ కావడంతో పాపం అనేక ఇబ్బందులు పడ్డాడు.  వరసగా ఆరు సినిమాలు ప్లాప్ అయ్యాయి.  ఆ తరువాత రామ్ ఇస్మార్ట్ శంకర్  రిలీజ్ అయ్యింది.  ఈ మూవీ సూపర్ హిట్ కొట్టింది.  


ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ తరువాత బాలయ్యతో ట్రై చేశారు.  ప్రస్తుతం బాలయ్య తన 105 వ సినిమా బిజీలో ఉన్నారు.  మహేష్ బాబు సినిమా చేసేందు కు రెడీగా లేకపోవడంతో విజయ్ ను ట్రై చేశారు.  విజయ్ దేవరకొండ పూరితో సినిమా చేసేందుకు ఒకే చేశాడు.  అధికారికంగా కూడా అనౌన్స్ జరిగిపోయింది.  


అయితే, పూరి.. విజయ్ తో ఎలాంటి సబ్జెట్ తో సినిమా చేస్తున్నారు అన్నది తెలియాల్సి ఉన్నది. పూరితో సినిమా అంటే హీరోలకు ఒకింత భయమనిచెప్పాలి .  ఎందుకంటే పూరి సినిమా లాటరీ లాంటిది.. హిట్టయితే భారీ హిట్ అవుతుంది.  లేదంటే భారీ ప్లాప్ అవుతుంది.  ఒక మోస్తరు హిట్ కొట్టడం అంటే సాధ్యం కాదు.  మరి విజయ్ కు పూరి ఇస్మార్ట్ శంకర్ లాంటి హిట్ ఇస్తాడో లేదంటే ప్లాప్ అవుతాడో చూడాలి.  ఇందులో నటీనటులను త్వరలోనే ప్రకటించనున్నారు 


మరింత సమాచారం తెలుసుకోండి: