సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి సాధించిన కీర్తి ప్రతిష్టలు ఎనలేనివి. ఆయన ప్రస్థానం ఎందరికో ఆదర్శం. అందుకే ఆయన సమకాలీన హీరోలు కూడా చిరంజీవి కష్టాన్ని తక్కువ చేసి చూడలేరు. రాజకీయ రంగంలోని వారు కూడా ఆయనకు గౌరవం ఇస్తారు. ఈరోజు ఆయన జన్మదినం సంధర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ కూడా చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

 

 

"ఇంటిల్లిపాదికీ వినోదాన్ని అందించే విభిన్నపాత్రలలో నటించి, ప్రేక్షకహృదయాలలో చెరగని స్థానాన్ని పదిలం చేసుకున్నారు చిరంజీవిగారు. పట్టుదల, కృషి ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చని నిరూపించి, ఎందరికో స్ఫూర్తిగా నిలచిన చిరంజీవిగారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు" అని లోకేశ్ ట్విట్టర్ ద్వారా మెగాస్టార్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మెసేజ్ పోస్ట్ చేయడం చూసి మెగా అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ‘థాంక్యూ లోకేశ్..’ అంటూ మెగా ఫాన్స్ రిప్లైలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా నందమూరి అభిమానులు కూడా రిప్లై ఇస్తూ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి, చంద్రబాబు నాయుడు, బాలకృష్ణల మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి. రాజకీయంగా దారులు వేరయినా సినిమాల పరంగా వీరి మధ్య మంచి సహృద్భావ వాతావరణం నెలకొంటుంది.

 

 

టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ట్విటర్‌ ద్వారా చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అన్ని వర్గాల వారి నుండి చిరంజీవికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పలువురు ఆయనకు నేరుగా శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. నిన్న హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా మెగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: