సినిమా.. ప్రతి ఒక్కరిని ఆకర్షించడంలో ముందు ఉంటుంది.  బోర్ కొట్టింది అంటే సినిమాలు వెళ్లారు. బోర్ కొట్టింది అంటే టీవీ లేదా లాప్ ఓపెన్ చేసి సినిమా చూస్తారు.  కాస్తంత మనసుకు ఆనందం కలిగిన తరువాత తిరిగి పనిని ప్రారంభిస్తారు.  మనసుకు ఉల్లాసాన్ని కలిగించేది సినిమా.  అందుకే సినిమాను మరింత అందంగా చూపించడానికి దర్శకనిర్మాతలు భారీగా ఖర్చు చేస్తున్నారు.  


భారీ ఖర్చు చేయడమే కాదు.  దానికి తగ్గట్టుగా అవుట్ ఫుట్ ఇస్తున్నారు.  భారీ వ్యయంతో సినిమాలు తెరకెక్కిస్తూ.. హాలీవుడ్ రేంజ్ కు ఏ మాత్రం తీసిపోకుండా సినిమాలు చేస్తున్న దర్శకనిర్మాతలకు హ్యాట్సాఫ్ చెప్పాలి. బాహుబలి తరువాత ఇండియా ఇండస్ట్రీలో మార్పులు మొదలయ్యాయి.  భారీతనం కూడిన సినిమాలు తీయడానికి ప్రతి సినిమా ఇండస్ట్రీ సిద్ధం అయ్యింది.  అంతకు ముందు భారీ సినిమాలు తీయాలి అంటే శంకర్ ఒక్కరే తీయగలరు అని టాక్ ఉండేది.  


కానీ, ఇప్పుడు అలాకాదు.. టాలెంట్ ఉన్న ప్రతి దర్శకుడు గొప్పగొప్ప సినిమాలు తీస్తున్నారు.  భారీ తనంతో కూడిన సినిమాలు తీయడంలో ముందు ఉంటున్నారు.  దానికి ఓ ఉదాహరణ సాహూ.  సాహూ సినిమా దాదాపు 350 కోట్ల రూపాయల ఖర్చుతో తెరకెక్కుతోంది.  పక్కా ఇండియన్ యాక్షన్ సినిమా. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడు చూడని విధంగా సినిమాను డిజైన్ చేశారు.  ఈ సినిమాకు దర్శకుడు సుజిత్.  సుజిత్ కు ఇది రెండో సినిమానే.  సుజిత్ ను నమ్మి 300 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ ను పెట్టారు అంటే అర్ధం చేసుకోవచ్చు.  


ఈ మూవీ ఆగష్టు 30 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  దీని తరువాత, సెప్టెంబర్ 12 వ తేదీన కిచ్చ సుదీప్ హీరోగా చేస్తున్న పహిల్వాన్ రిలీజ్ కాబోతున్నది.  దీన్ని కూడా భారీ బడ్జెట్ తో తెరక్కించారు.  కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతున్నది.  ఈరోజు రిలీజైన ట్రైలర్ చూస్తుంటే సినిమాపై అంచనాలు పెరిగాయి.  గ్రామంలో ఒక పహిల్వాన్ గా కుస్తీ పెట్టె ఓ వ్యక్తి... అంతర్జాతీయంగా ఎలా గుర్తింపు పొందాడు అన్నది కథ. ఈ కథను అద్భుతంగా తెరకెక్కించినట్టు తెలుస్తోంది. 


ఈ మూవీ రిలీజ్ తరువాత.. 20 రోజులకు మెగాస్టార్ సైరా రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాను కూడా భారీగా నిర్మించారు.  ఇప్పటికే రిలీజైన టీజర్ ఆకట్టుకుంది.  తెలుగుతో పాటు సౌత్ ఇండియన్ భాషలు, హిందీలో కూడా సినిమా రిలీజ్ అవుతున్నది.  ఇప్పుడు హీరోలంతా పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతుండటం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: