వెంకటాపురం అనే గ్రామంలో ఉన్న ఇద్దరు ప్రేమికుల కథను 'రాజావారు రాణిగారు' పేరుతో తెరకెక్కించారు. ఎస్‌ఎల్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై డి.మనోవికాస్‌ నిర్మించిన చిత్రమిది. కిరణ్‌ అబ్బావరమ్‌, రహస్యగోరక్‌ హీరోహీరోయిన్లుగా నటించారు. రవికిరణ్‌ దర్శకత్వం వహించారు. చిత్ర టీజర్‌ను సోమవారం ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ఆవిష్కరించారు.


ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా లో బాగా హైలైట్ అయిన పేరు  'రాజావారు రాణిగారుస‌  . పోస్టర్లతో టీజర్ తో జనాలలో మంచి ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం గతవారమే మొదటి పాట ద్వారా ప్రేక్ష‌కుల‌కు మరింత చేరువైంది. రాజావారు రాణిగారు టైటిల్ సాంగ్ కు విశేషమైన స్పందన రావడంతో చిత్రబృందం ఈ సినిమా లోని
రెండో పాటని కూడా విడుదల చేసారు.


జయ్ క్రిష్ సంగీత సారథ్యంలో రూపొందిన 'నమ్మేలా లేదే ..' అనే ఈ మెలోడీ కి కూడా నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా యూత్ ఈ పాటకి కనెక్ట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అనురాగ్ కులకర్ణి గాత్రం ఈ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. 'నమ్మేలా లేదే..కల కాదే.. మనసే మేఘమాయే' అంటూ సాగే ఈ పాట సాహిత్యపరంగా కూడా చాలా బావుండటం కలిసొచ్చే అంశం.


నిర్మాత మాట్లాడుతూ... 'ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. కథ విన్నాక బాగా నచ్చి నేనే నిర్మించా. హీరో హీరోయిన్లు చక్కగా నటించారు. త్వరలో ఆడియోను విడుదల చేయనున్నామ'ని పేర్కొన్నారు. 


హీరోయిన్‌ మాట్లాడుతూ 'నా పేరు రహస్య. నాకు ఇంత మంచి క్యారెక్టర్‌ ఇచ్చిన ప్రొడ్యూసర్‌, డైరెక్టర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు. సినిమా చాలా బావుంటుంది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాన'న్నారు.


హీరో మాట్లాడుతూ 'ఇంతకు ముందు నేను రెండు వెబ్‌సిరీస్‌లో చేశాను. అప్పుడు కొంచెం టెన్షన్‌ ఉండేది. ఈ సినిమా రెండు, మూడు నెలల్లో విడుదలవుతుంది. మూవీ చాలా బాగా వచ్చింది. ఈ సినిమా ఇంత బాగా రావడానికి ముఖ్య కారణం మా నిర్మాతగారి ఫాదర్‌' అని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: