ఆగష్టు 30 ఉదయం గురించి ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తూ ‘సాహో’ ను మొదటిరోజు మొదటి షో చూడటానికి కలలు కంటున్నారు. ఈ మ్యానియాను దృష్టిలో పెట్టుకుని ‘సాహో’ బయ్యర్లు ఈనెల 29 అర్దరాత్రి 12 గంటల నుండి ‘సాహో’ స్పెషల్ షోలను విజయవాడ గుంటూరు విశాఖ లాంటి ప్రముఖ నగరాలలో వేయడానికి రంగం సిద్ధం చేసారు. 

ఈ స్పెషల్ షో టిక్కెట్లు 500 రూపాయల నుండి 1000 రూపాయల వరకు పెట్టబోతున్నారు. ప్రభాస్ అభిమానులు అసలు టిక్కెట్లు దొరికితే చాలు ఎంత డబ్బు అయినా ఫర్వాలేదు అని అంటున్నారు. దీనితో ఈ మూవీ స్పెషల్ షోల టిక్కెట్లు హాట్ కేక్స్ లా అమ్మకం జరగడం ఖాయం అన్న సంకేతాలు వస్తున్నాయి.

అయితే ఈ పరిణామాలను చూస్తున్న వారు మాత్రం ‘సాహో’ కు ‘బ్రహ్మోత్సవం’ జ్ఞాపకాలు వెంటాడతాయ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘బ్రహ్మోత్సవం’ మూవీ కూడ ఆ సినిమా విడుదలకు ముందురోజు ఆ మూవీ పై అప్పట్లో ఏర్పడిన క్రేజ్ రీత్యా స్పెషల్ షోలు వేశారు. అయితే ఆ మూవీ ఫ్లాప్ కావడంతో తెల్లవారేసరికి ఆమూవీ ఫెయిల్యూర్ టాక్ దావానం లా వ్యాపించి అందరికి తెలిసిపోయింది.

ఈ నెగిటివ్ టాక్ ను స్ప్రెడ్ చేయడంలో మహేష్ వ్యతిరేకులు కీలక పాత్ర వహించారు అన్న వార్తలు అప్పట్లో వచ్చాయి. దీనితో ‘సాహో’ కు అలాంటి పరిస్థితి ఎదురౌతుందా అన్న సందేహాలు కొందరికి కలుగుతున్నాయి. ‘సాహో’ ఫెయిల్ చేయాలి అని ఇప్పటికే కొందరు చాల తీవ్రంగా ప్రయత్నిస్తున్న పరిస్థితులలో ‘సాహో’ మూవీకి డివైడ్ టాక్ వస్తే పరిస్థితి ఏమిటి అన్న సందేహాలు మాత్రమే కాకుండా ఈ స్పెషల్ షోలను చూసే ప్రభాస్ యాంటి ఫ్యాన్స్ చేసే ప్రచారాన్ని తట్టుకుని నిలబడే స్థాయిలో ‘సాహో’ ఉంటుందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు..  
 



మరింత సమాచారం తెలుసుకోండి: