రానా ఆరోగ్యం గురించి వచ్చిన వార్తలను రానా కుటుంబ సభ్యులు ఖండించినా ఇంకా రానా అమెరికాలోనే ఉండటం అనేక సందేహాలకు తావు ఇస్తోంది. దీనితో రానా అభిమానులు గత కొద్దిరోజులుగా రానా లేటెస్ట్ ఫోటో కావాలి అంటూ అనేకసార్లు అడగటంతో రానా తాను కారులో కూర్చున్న ఒక ఫోటోను ఈమధ్య షేర్ చేసాడు. 

అయితే ఆ ఫోటో చుట్టూ కూడ అనేక అనుమానాలు ఏర్పడుతున్నాయి. రానా సన్నిహితులు చెపుతున్న సమాచారం ప్రకారం రానా ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు లెక్క. కారులో కూర్చుని ఉన్న ఆ ఫోటోలో రానా కనిపిస్తున్నాడు కానీ ఎక్కడా తాను అమెరికాలో ఉన్నాను అని చెప్పే ఆధారాలు కనిపించడం లేదు అంటూ అతడి అభిమానులే సందేహాలు వ్యక్త పరుస్తున్నారు.  

‘హాథీ మేరీ సాథీ’ సినిమా కోసం రానా సన్నబడి డిఫరెంట్ లుక్ లో గడ్డం పెంచి ఆ మధ్య హడావిడి చేసిన ఫోటోను మళ్ళీ షేర్ చేసి రానా తన అభిమానులను ఫూల్స్ చేస్తున్నాడా అంటూ కామెంట్స్ వస్తున్నాయి. రానా కుటుంబ సభ్యులు అంగీకరించినా అంగీకరించపోయినా రానా ఆరోగ్యంలో తేడా వచ్చింది అన్నది ఓపెన్ సీక్రెట్. దీనికితోడు ఈమధ్య రానాకు జరిగిన కిడ్నీ సర్జరీతో రానా బాగా సన్నబడటంతో రానా లావు అవ్వడానికి ప్రస్తుతం స్టెరాయిడ్స్ ఇచ్చి రానా కొద్దిగా లావు అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు కొత్త గాసిప్పులు పుట్టుకు వస్తున్నాయి. 

అయితే అసలు విషయాన్ని డైవర్ట్ చేస్తూ తాను అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఎందుకు ఉన్నాడో క్లారిటీ ఇవ్వకుండా ఇలా ఎన్నిరోజులు రానా మేనేజ్ చేయగలడు అంటూ కొందరు జోక్ చేస్తున్నారు. దీనితో రానా కుటుంబ సభ్యులు పూర్తిగా కాకపోయినా కొద్దిగా అయినా రానా ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి కొద్దిగా అయినా క్లారిటీ ఇస్తే హుందాగా ఉంటుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: