జులై 26వ తేదీన విడుదలైంది డియర్ కామ్రేడ్ సినిమా. గీతా గోవిందం సినిమా తరువాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించటంతో రిలీజ్ ముందు ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. సినిమాను నాలుగు భాషల్లో రిలీజ్ చేయటం, మేజర్ ఏరియాల్లో సినిమా రిలీజ్ కు ముందు మ్యూజిక్ ఫెస్టివల్స్ నిర్వహించటం చేసాడు విజయ్ దేవరకొండ. విజయ్ భారీగా ప్రమోషన్లు చేయటంతో మొదటి రోజు భారీగా వసూళ్ళు వచ్చాయి. 
 
కానీ సినిమాకు యావరేజ్ టాక్ రావటంతో రెండో రోజు నుండే కలెక్షన్లు తగ్గాయి. 34 కోట్ల రుపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన డియర్ కామ్రేడ్ ఫుల్ రన్లో 25 కోట్ల రుపాయలు వసూలు చేసింది. ఈ సినిమా ఫ్లాప్ కావటానికి విజయ్ దేవరకొండ కారణమని షూటింగ్ సమయంలో సినిమాలోని ఆర్టిస్టులకు ఎలా నటించాలో చెప్పేవాడని, సినిమాలో చాలా భాగం రీషూట్లు చేయించాడని రకరకాల వార్తలు వచ్చాయి. 
 
ఇలాంటి వార్తలు తనపై రావటంతో విజయ్ దేవరకొండ బాగా హర్ట్ అయ్యాడని సమాచారం. ప్రస్తుతం విజయ్ దేవరకొండ క్రాంతిమాధవ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన క్రియేటివ్ విషయాల్లో తన జోక్యం ఉండదని దర్శకనిర్మాతలకు చెప్పినట్లు సమాచారం. సినిమా ప్రమోషన్ల బాధ్యతలు మాత్రం చూసుకుంటానని చెప్పినట్లు తెలుస్తోంది. 
 
విజయ్ దేవరకొండ నటిస్తున్న ఈ సినిమా ఈ సంవత్సరం చివర్లో విడుదల కాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వస్తున్న సినిమాకు ఫైటర్ అనే పేరును ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. 2020 జనవరి నుండి ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతుంది. ఈ సినిమాను పూరీ జగన్నాథ్ తన సొంత బ్యానర్ పై నిర్మిస్తున్నట్లు సమాచారం అందుతోంది. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: