ప్రభాస్ ,సాహో  తరువాత  విడుదలకానున్న భారీ బడ్జెట్ చిత్రం సైరా.  ఈరెండు సినిమాలపై  ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే  కాదు  దేశ వ్యాప్తంగా  భారీ క్రేజ్  నెలకొంది.  అందుకు తగ్గట్లే ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో సత్తా చూపిస్తున్నాయి.  రెండు సినిమాలు ఎక్కడా తగ్గడం లేదు. సాహో ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పటికే పూర్తికాగా  సైరా  ఇంకొన్ని  జిల్లాలో పెండింగ్ వుంది.  ఇక సైరా  గోదావరి జిల్లాల్లో  రికార్డు  స్థాయిలో  బిజినెస్ చేసింది.  ఆ జిల్లాల్లో  మెగా ఫ్యామిలీ కి అభిమానులు ఎక్కువ దాంతో ఈ చిత్రం తూర్పు గోదావరి లో 10.40 కోట్లు , పశ్చిమ గోదావరి లో 9.20 కోట్ల బిజినెస్ చేసింది. ఆ రెండు జిల్లాలకు కలిపి 19.60కోట్లు అన్నమాట. ఇదే ఆల్ టైం రికార్డు . మరి  ఈమొత్తాన్నీ వెనక్కుతీసుకొస్తుందో లేదో చూడాలి. 





స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి  జీవిత చరిత్ర ఆధారంగా సురేందర్ రెడ్డి  తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మెగా స్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించగా లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటించింది.  బిగ్ బి అమితాబ్ బచ్చన్,  జగపతి బాబు  విజయ్ సేతుపతి , రవి కిషన్   ,సుధీప్, తమన్నా  ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.  ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క  టీజర్  యూట్యూబ్ లో దుమ్ము రేపింది. బాలీవుడ్  మ్యూజిక్  డైరెక్ట్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తుండగా  భారీ బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్స్  పతాకంఫై  రామ్ చరణ్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.   అక్టోబర్ 2న తెలుగు , హిందీ , కన్నడ , మలయాళ , తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదలకానుంది.  చిరు కెరీర్ లో ఆయన నటించిన సినిమా ఇన్ని భాషల్లో ఒకేసారి  విడుదలకావడం  ఇదే మొదటిసారి.


మరింత సమాచారం తెలుసుకోండి: