టాలీవుడ్ చుల్ బులి గా పేరుగాంచిన సమంత రూత్ ప్రభు, ఇటీవల అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకుని, అక్కినేని వారి ఇంటి కోడలుగా మారిపోయింది. తొలిసినిమా ఏం మాయం చేసావేతోనే సూపర్ సక్సెస్ అని అందుకున్న సమంత, ఆనతి కాలంలోనే మంచి క్రేజ్ తో అద్భుతమైన సినిమాలతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగారు. ఇక ఎప్పటికపుడు తన సినిమాలు మరియు ఫ్యామిలీ లైఫ్, మరియి పర్సనల్ విషయాలను గురించి తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకునే సమంత, 

నేడు తన సోషల్ మీడియా మాధ్యమం ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, ఈ వీడియోలో సమంత కష్టతరమైన వర్కవుట్స్ చేయడంతో పాటు, ఏ మాత్రం కాళ్ళ సాయం లేకుండా కేవలం చేతులతో ఒక పోల్ ని ఎక్కేయడం గమనించవచ్చు. ఒకరకంగా ఇది చాలా కష్టమైన విషయం అనే అంటున్నారు పలువురు నిపుణులు. అయినప్పటికీ గట్టి దృఢ నిశ్చయంతో, పట్టుదలతో సమంత ఈ ఫీట్ ని చేయడం జరిగింది. అంతేకాక, ఆమె 'కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఎప్పుడూ వెనకడుగు వేయకండి. ఎందుకంటే మీ అసలు సామర్థ్యం తెలిస్తే మీకే ఆశ్చర్యం వేస్తుంది' అనే శీర్షికను కూడా తాను పోస్ట్ చేసిన వీడియోకు జోడించింది. 

ఇక సమంత పోస్ట్ చేసిన ఈ వీడియోకు ఆమె అభిమానులతో పాటుగా పలువురు సినిమా ప్రముఖులు సైతం వావ్ అంటూ ఆమెపై పొగడ్తలు కురిపిస్తున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ గారి సతీమణి నమ్రత, హీరోయిన్లు పూజ హెగ్డే, ప్రగ్య జైస్వాల్ ఈ వీడియో చూసి, ఎంతో అద్భుతం అంటూ ఆమెను ప్రశంసిస్తూ రిప్లై ఇవ్వడం జరిగింది. ఇక ఇటీవల ఓబేబీ సినిమాతో మంచి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్న సమంత, అతి త్వరలో ఒక వెబ్ సిరీస్ లో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తలపై సమంత స్పందించాల్సి ఉంది....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: