కోలీవుడ్ లో బిగ్ బాస్ సీజన్ 3 హంగమా అంతా ఇంతా కాదు. కమల్ హాసన్ హోస్ట్ గా చేస్తున్న ఈ షో ప్రతి సీజన్ లో ఏదో ఒక సెన్సేషన్ జరగాల్సిందే. లాస్ట్ సీజన్ లో ఓవియా రచ్చ తెలిసిందే. ఇక తమిళ బిగ్ బాస్ సీజన్ 3 లో ఈసారి నటి మధుమిత చేసిన హంగమా హాట్ న్యూస్ అయ్యింది. తనని హౌజ్ లోనుండి బయటకు పంపించాలంటూ ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించడం జరిగింది.


అయితే బిగ్ బాస్ టీం వెంటనే ఆమెను హౌజ్ నుండి ఎలిమినేట్ చేశారు. అంతా అయ్యింది అనుకుంటున్న టైంలో బయటకు వెళ్లిన మధుమిత తనకు బిగ్ బాస్ నుండి రెమ్యునరేషన్ రావాల్సి ఉందని రెండు రోజుల్లో అది ఇవ్వకపోతే తను మళ్లీ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తుందట. అయితే ఈ విషయంపై తమిళ్ బిగ్ బాస్ ప్రసారమవుతున్న విజయ్ టివి మేనేజర్ ప్రసాద్ మధుమిత మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు.    


ఆమె షో నుండి బయటకు వచ్చినప్పుడే 11.5 లక్షల మొత్తాన్ని రెమ్యునరేషన్ గా ఇచ్చామని.. అయితే మిగిలిన కొంతమొత్తాన్ని 42 రోజుల తర్వాత ఇస్తామని అగ్రిమెంట్ చేసుకున్నామని ఈలోగా ఆమె రెండు రోజుల్లో తన డబ్బు ఇవ్వకపోతే చనిపోతానని బెదిరిస్తున్నట్టుగా ఫిర్యాదులో రాసుకొచ్చారు విజయ్ టివి మేనేజర్ ప్రసాద్. బయటకు వచ్చాక కూడా బిగ్ బాస్ టీంను ఇబ్బంది పెడుతుంది మధుమిత.   


ఈ కేసు విషయంపై మధుమిత మాత్రం తనకు రావాల్సిన డబ్బు అడిగితే బిగ్ బాస్ నిర్వాహకుల నుండి ఎలాంటి సమాధానం రాలేదని చెప్పుకొచ్చింది. సో ఈ లెక్కన తమిళ బిగ్ బాస్ తో పోల్చితే తెలుగులో మన వాళ్లు ఇంట్లో గొడవలతో సరిపెట్టుకుంటున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 లో సంపూర్ణేష్ ఇంట్లోంచి బయటకు వెళ్లాలని నానా రచ్చ చేశాడు. అయితే అతను బయటకు వచ్చాక రెమ్యునరేషన్ గురించి పెద్దగా పట్టించుకోలేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: