లోఫర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది దిశాపటాని. వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది. దాంతో తెలుగులో ఒక్క సినిమా కూడా అవకాశం రాలేదు. సాధారణంగా పూరి హీరోయిన్ అంటే టాలీవుడ్ లో కనీసం ఓ మూడు నాలుగు సినిమాలైనా చేయాలి. అందుకు ఉదాహరణ రక్షిత, ఆసిన్..లాంటివాళ్ళే. కానీ దిశాకు మాత్రం టాలీవుడ్ లో దశ తిరగలేదు. ఆ తరువాత బాలీవుడ్ లో మాంచి సినిమాలు చేసి పేరు తెచ్చుకుంది. ఇప్పడు బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా బాగానే పాపులర్ అయింది.

ఈ పాపులారిటితోనే ఇన్నాళ్ళకు తెలుగులో అవకాశం వెదక్కుంటూ వచ్చిందని సినీ జనాలు చెప్పుకుంటున్నారు. బన్నీ హీరోగా దిల్ రాజు నిర్మించే ఐకాన్ సినిమాకు దిశాపటానిని ఎంపిక చేసినట్లు తాజా సమాచారం. ఇదంతా ఒక మాయలా జరిగిందని చాలా మంది అనుకుంటున్నారు. అసలు ఇంత త్వరగా బన్నీ సినిమాకు దిల్ రాజు హీరోయిన్ ను సెలెక్ట్ చేస్తారని ఎవరు ఊహించనిది. ఆలియా భట్ లెవెల్ హీరోయిన్ కోసం బన్నీ అండ్ దిల్ రాజు చూసిన సంగతి వాస్తవమే. అదే సమయంలో అఖిల్ -బొమ్మరిల్లు భాస్కర్ సినిమా కోసం దిశాపటానీ వైపు వెళ్ళారు గీతా సంస్థ వారు.

కానీ అఖిల్ హీరో అంటే దిశ అంతగా ఆసక్తి చూపించలేదని తెలిసింది. పైగా నాలుగు కోట్ల వరకు రెమ్యూనిరేషన్ డిమాండ్ చేస్తోందట. దాంతో ఆ ఆలోచన ఇటు మార్చి, బన్నీకి దిశాపటానిని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అసలు తెలుగులో ఒక్క హిట్ కూడా లేని దిశా పటానికి నాలుగు కోట్ల రెమ్యునిరేషన్ ఆఫర్ ఎక్కువేనని ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న మాట. అంతేకాదు బాలీవుడ్ లో మరీ అంత పాపులర్ కూడా కాదు కదా..కొన్ని హిట్ సినిమాలున్నాయంతేగా..ఈ అమ్మడికిచ్చే రెమ్యునిరేషన్ తో ఓ చిన్న సినిమా కంప్లీట్ చేయోచ్చు అన్న మాట కూడా బాగానే వినిపిస్తోంది. మరి చిత్ర బృందం ఏ ఉద్ధేశ్యంతో దిశాకు ఇంత మొత్తం ఆఫర్ చేసారో తెలీదు.



మరింత సమాచారం తెలుసుకోండి: