డైరక్టర్ మారుతి ఇప్పటి వరకు తీసిన సినిమాలలో సూపర్ హిట్లున్నాయి. ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. అయినా తను మాత్రం గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ లో సినిమాని చేసే అవకాశాన్ని అందుకున్నాడు. ఇక మారుతి తన కెరిర్ ప్రారంభంలో డిస్ట్రిబ్యూటర్, నిర్మాత. ఆ తరువాతే డైరక్టర్ గా మారారు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు స్నేహితులతో కలిసి సినిమాల డిస్ట్రిబ్యూషన్ మీద పెట్టుబడి పెడుతుంటారు మారుతి. గతంలో ఆయన తన సినిమాలు కొన్నింటిని ఓవర్ సీస్ మార్కెట్ లో తన భాగస్తులతోనే కొని విడుదల చేసి లాభాలు చేసుకున్నారు. ఇప్పుడు కూడా అదే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

లేటెస్ట్ గా సాయిధరమ్ తేజ్ తో డైరక్ట్ చేస్తున్న ప్రతిరోజూ పండుగే సినిమాను ఓవర్ సీస్ మార్కెట్ రైట్స్ ను తానే కొనుక్కున్నట్లు లేటెస్ట్ న్యూస్. రెండుకోట్ల పాతిక లక్షలకు మారుతి ఆ సినిమా ఓవర్ సీస్ రైట్స్ తీసుకుని, తన ఓవర్ సీస్ భాగస్వాముల దగ్గర పెట్టినట్లు తెలుస్తోంది. దర్శక నిర్మాతగానే కాక మారుతి ఇలా కొత్తగా పెట్టుబడి పెట్టి కూడా బాగా లాభాలను పొందాలని చూడటం ఆసక్తికరమైన విషయమేనని చెప్పాలి. 

అయితే ప్రస్తుతం ఓవర్ సీస్ మార్కెట్ అంతా బాగాలేదు. రెండుకోట్ల పాతికలక్షలు అంటే కాస్త రిస్కైనై ఈ విషయం తెలిసిన వాళ్ళు కొంతమంది అంటున్నారు. మాంచి ఫీల్ గుడ్ సినిమా...ఫన్ ఎంటర్ టైనర్ అని పేరు తెచ్చుకుంటేనే ఓవర్ సీస్ మార్కెట్ లో గట్టెక్కడానికి చాన్స్ వుంటుంది. లేదంటే మాత్రం పెట్టినదాంట్లో సగం కూడా తిరిగి రావడం కష్టం. గతంలో కొన్ని మారుతి సినిమాలు ఓవర్ సీస్ మార్కెట్ లో లాస్ అయితే కొన్ని బాగానే వసూళ్లు సాధించాయి. ఆ  ధైర్యంతోనే ఈ సినిమా బిజినెస్ లోకి ఎంటర్ అయి వుండొచ్చునని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారట. మరి ఈ సినిమా మారుతిని ఓవర్ సీస్ లో ముంచేస్తుందో తేలుస్తుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: