ప్రభాస్ నటించిన సాహో సినిమా ఈ నెల 30వ తేదీన విడుదల కాబోతుంది. 350 కోట్ల రుపాయల భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించింది. విడుదలకు ముందే ఈ సినిమా అనేక రికార్డులను సొంతం చేసుకుంటోంది. దాదాపు 300 కోట్ల రుపాయల థియేట్రికల్ బిజినెస్ చేసిన సాహో సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ లోను రికార్డులు సృష్టిస్తుంది. ఇప్పటివరకు ఏ సినిమాకు సాధ్యం కాని రికార్డులు సాహో సొంతం చేసుకుంటోంది. 
 
సాహో తెలుగు, తమిళం, మలయాళం శాటిలైట్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ తీసుకుంది. దాదాపు 42 కోట్ల రుపాయలకు ఈ డీల్ జరిగినట్లు సమాచారం. హిందీ డిజిటల్ రైట్స్ కోసం 58 కోట్ల రుపాయలకు అమెజాన్ ప్రైమ్ తోనే డీల్ కుదిరినట్లు సమాచారం. కేవలం సాహో సినిమా డిజిటల్ రైట్స్ మాత్రమే 100 కోట్ల రుపాయలకు అమ్ముడయినట్లు తెలుస్తుంది. శాటిలైట్ రైట్స్ విషయానికి వస్తే తెలుగు, తమిళం, మలయాళం శాటిలైట్ రైట్స్ 36 కోట్ల రుపాయలకు అమ్ముడయినట్లు సమాచారం. 
 
హిందీ శాటిలైట్ రైట్స్ 40 కోట్ల రుపాయలకు అమ్ముడయినట్లు తెలుస్తుంది. సాహో శాటిలైట్, డిజిటల్ రైట్స్ అన్నీ కలిపి 176 కోట్ల రుపాయలకు అమ్ముడయినట్లు తెలుస్తుంది. సాహో సినిమా బడ్జెట్లో సగం శాటిలైట్, డిజిటల్ రైట్స్ ద్వారానే వచ్చేసాయి. ఈ సినిమాతో దాదాపు 100 కోట్ల రుపాయలకు పైగా నిర్మాతలకు విడుదలకు ముందే లాభం చేకూరుతుందని సమాచారం. సాహో సినిమాకు హిట్ టాక్ వస్తే విడుదలయ్యాక నిర్మాతలకు భారీ లాభాలు వస్తాయనటంలో సందేహం లేదు. 
 
బాహుబలి సిరీస్ తరువాత దాదాపు రెండు సంవత్సరాల సమయం ప్రభాస్ ఈ సినిమా కోసం కేటాయించాడు. రన్ రాజ్ రన్ సినిమా తరువాత సుజీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ హీరోయిన్ శ్రధ్ధా కపూర్ ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా నటిస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: