బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కు బాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనలాంటి స్టార్ డం ఉన్న నటుడికి కొన్ని ప్రత్యేకమైన సౌకర్యాలు ఉంటాయి. అయితే అమితాబ్ ఎప్పుడు వాటిని వద్దని చెబుతుంటాడు. అంతేకాదు ఎప్పుడు ఓ సాధారణ వ్యక్తిగా ప్రవర్తిస్తాడు. 


కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమం ద్వారా అమితాబ్ ఎంతోమంది ప్రేక్షకులకు దగ్గరయ్యారు. సిల్వర్ స్క్రీన్ పైనే కాదు స్మాల్ స్క్రీన్ పై కూడా తన సత్తా చాటి చూపారు. ప్రస్తుతం కె.బి.సి 11వ సీజన్ ఈమధ్యనే మొదలైంది. ఈ సీజన్ లో అమితాబ్ ఎంతోమంది అద్భుతమైన వ్యక్తులకు కె.బి.సిలో అవకాశం ఇస్తున్నారు.        


కె.బి.సి ఆటలో భాగంగా ఈ సీజన్ లో ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ సింధూతాయ్ సపకల్ ను షోలో పాల్గొన్నారు. వెయ్యి మందికి పైగా అనాథలకు అన్నిటిని చూసుకుంటుంది. ఆమె గురించి ఇంట్రో ఇచ్చి ఆమె కె.బి.సి స్టేజ్ మీదకు రాగానే సింధూతాయ్ సపకల్ కాళ్లు మొక్కి నమస్కరించాడు అమితాబ్. కె.బి.సి హోస్ట్.. అంతకన్నా పెద్ద స్టార్ క్రేజ్ ఉన్నా సరే అమితాబ్ చేసిన ఈ పనికి అందరు ఆయన్ను మెచ్చుకుంటున్నారు.    


ప్రస్తుతం ఈ ఎపిసోడ్ కు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రత్యేకంగా అమితాబ్ బచ్చన్ తన సోషల్ బ్లాగ్ లో ఈ వీడియోని షేర్ చేశారు. ఈ ఎపిసోడ్ లోనే అమితాబ్ టిక్ టాక్ తో ఫేమస్ అయిన ఓ వ్యక్తిని టిక్ టాక్ ఎలా చేయాలో నేర్పమంటూ చెప్పడం విశేషం. ఇంటికెళ్లి తాను కూడా టిక్ టాక్ ట్రై చేస్తాననడం విశేషం. ఇక సినిమాల విషయానికొస్తే అమితాబ్ మొదటిసారి ఓ తెలుగు సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. మనంలో జస్ట్ అలా కెమియో ఇచ్చారు. కాని సైరాలో మాత్రం ఆయన మెగాస్టార్ చిరంజీవికి అదేనండి నరసిం హా రెడ్డి గురువుగా కనిపించనున్నారు. 
  


మరింత సమాచారం తెలుసుకోండి: