తెలుగు సినిమా రేంజ్ రోజురోజుకు పెరుగుతూ పోతోంది. బాలీవుడ్లోని తారాగణం ఇక్కడికి వచ్చి పని చేయడానికి ఏమాత్రం సంకోచించని లేదు. అలియా భట్ అలాంటి టాప్ హీరోయిన్ రాజమౌళి సినిమా 'ఆర్ ఆర్ ఆర్' కు సంతకం చేయడంతో తనకి తెలుగులో నటించేందుకు ఏ మాత్రం అభ్యంతరం లేదని సంకేతం ఇచ్చేసింది. అలాగే శ్రద్ధ కపూర్ కూడా సాహో కి చేసింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా బాగా పాపులర్ నటుడు అయినా అల్లు అర్జున్ కూడా వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బాలీవుడ్ హీరోయిన్ కోసం చూస్తున్నట్లు సమాచారం.

అల్లు అర్జున్ నటించిన సినిమాలు హిందీలో డబ్ అయ్యి… అక్కడ బాగా ప్రజాదరణ సంపాదించాయి.  డిజిటల్ రైట్స్ మరియు హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో బన్నీ సినిమాలకు పెద్ద మొత్తమే ముడుతోంది కాబట్టి బన్నీకి అక్కడ మార్కెట్ ఎక్కువ. ఆ ధైర్యం తోనే ఏమో ప్రొడ్యూసర్లు ఆలియా భట్ ను 'ఐకాన్' సినిమా కోసం అడిగారు. అయితే డేట్లు కుదరవు అని చెప్పి ఆమె వారి ప్రపోజల్ ను సున్నితంగా తిరస్కరించిందని సమాచారం. అయితే అందుకు ముఖ్య కారణం అది కాదట.

కొద్ది కాలం నుండి హిందీలో కూడా ఆలియా కమర్షియల్ సినిమాలు చేయడం లేదు. తాను సౌత్ లో కమర్షియల్ హీరోయిన్ అనిపించుకోవాలని అనుకోవడం లేదట. ఆర్ ఆర్ ఆర్ సినిమా కూడా కాన్సెప్ట్ మరియు బాహుబలి డైరెక్టర్ అని చెప్పి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే బన్నీ బాలీవుడ్ హీరోయిన్ ఆశలు మాత్రం చావలేదు. వెంటనే మేకర్లు మరో బాలీవుడ్ భామని హీరోయిన్ పాత్ర కోసం సంప్రదించారు.

వరుణ్ తేజ్ సరసన లోఫర్ లో అందాలతో కుర్రకారుని ఊపేసిన బాలీవుడ్ బాంబ్ షెల్ బ్యూటీ దిశాపటాని కి ఈ ఆఫర్ వెళ్లిందట. 'లోఫర్' సినిమా సమయంలో అయితే ఆమె వెంటనే ఒప్పేసుకునేది. ఇప్పుడు తనకి కూడా స్టార్ హోదా వచ్చేసింది. అందుకని ఆమె 'ఐకాన్ 'సెక్స్ సినిమా కోసం ఏకంగా నాలుగు కోట్లు డిమాండ్ చేసినట్లు చెప్తున్నారు. హిందీలో తనకు సినిమాకి ఎంత ఇస్తారో ఇక్కడ కూడా అంతే కావాలని ఆమె అడిగిందట.

ఆర్ ఆర్ ఆర్, సాహో సినిమాలకు అయితే సరే కానీ అల్లు అర్జున్ సినిమా ఎన్ని భాషల్లో రిలీజ్ అవుతుందో కూడా ఇప్పటికే తెలియవు. ఈ పరిస్థితుల్లో లో దాదాపు 5 కోట్లు ఇచ్చి దిశా ని తీసుకునే రిస్క్ చేస్తారా? ఇంతకీ యువ దర్శకుడు తో తీస్తున్న బన్నీ సినిమాకి అంత సీన్ ఉందా? తెలుసుకోవాలంటే వేచి చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: