ఎస్వీ రంగారావు అంటే నటనకు పెద్ద బాలశిక్ష. ఆయన తెరపైన  నటిస్తే చాలు అవతల పాత్రలు ఏంటి అన్నది ఎవరూ అసలు చూడరు. ఆయన నటనతో పాటు డైలాగ్ డెలివరీ ఓ ప్రత్యేకత. అందులో ఆయన టైమింగ్ అన్నీ కలసి విశ్వనట చక్రవర్తిని చేశాయి. ఎస్వీయార్ సినిమాలో ఉంటే చాలు మిగిలిన నటులు ఎవరున్నా సైడ్ క్యారక్టర్ లోకి వెళ్ళిపోతారన్న ప్రచారం అప్పట్లో ఉండేది. ఆయన నటనా పటిమను చెప్పడానికి ఎన్ని ఉదాహరణలు అయినా చెప్పవచ్చు.


ఇదిలా ఉండగా ఎస్వీయార్ నటనకు కొలిచే బిరుదులు ఈ దేశంలో లేకుండా పోయానని అభిమానులు అంటారు. అందుకే ఆయనకు పద్మ అవార్డులు ఏవీ రాలేదని కూడా అంటారు. నిజానికి ఆ అవార్డులకు ఎస్వీయార్ ని వరించే అద్రుష్టం లేదని కూడా అంటారు. ఎస్వీయార్ సొంతంగా సినిమాలు కూడా తీశారు. బాంధవ్యాలు లాంటి కుటుంబ చిత్రాలకు దర్శకత్వం వహించారు కూడా.


ఇదిలా ఉండగా ఎస్వీయార్ కాంస్య   విగ్రహాన్ని తాడేపల్లిగూడెంలో అభిమానులు ఏర్పాటు చేశారు. ఆ విగ్రహాన్ని రేపు ఆదివారం మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించనున్నారు.  తాడేపల్లిగూడెం కేఎన్ రోడ్డులో అభిమానుల సమక్షంలో  ఉదయం పది గంటలకు ఘనంగా నిర్వహించనున్నారు. ఇక చిరంజీవి చాలా కాలం తరువాత జనం వద్దకు వస్తున్నారు.


దాంతో చిరు రాక నేపధ్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.  చిరంజీవి ఇపుడు పూర్తి నటుడుగా మారి వస్తునందున పూర్వం క్రేజి అలాగే ఉంది. దాంతో అభిమానులను కంట్రోల్ చేయడం కష్టమని భావించి పోలీసులు తగిన చర్యలు చేపడుతున్నారు. మొత్తానికి ఓ మహా నటుడి విగ్రహాన్ని మరో మెగా నటుడు ఆవిష్కరించడం అంటే ఇదొక చరిత్రగానే చెప్పాలి. ఇద్దరూ చరిత్ర స్రుష్టించిన నటులు కావడం తెలుగు కళామతల్లి చేసుకున్న అద్రుష్టమని చెప్పాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: