అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో తొలుత ఒక చిన్న పాత్రలో తళుక్కుమన్న సునీల్, ఆ తరువాత 2000వ సంవత్సరంలో విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తరుణ్, రిచాల కలయికలో వచ్చిన సూపర్ డూపర్ హిట్ మూవీ నువ్వే కావాలి మూవీతో టాలీవుడ్ కి కమెడియన్ గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆ తరువాత చిరునవ్వుతో, నువ్వు నేను, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, మనసంతా నువ్వే, నువ్వు లేక నేను లేను, సొంతం, నువ్వే నువ్వే తదితర సినిమాల్లో ఆకట్టుకునే కామెడీ పాత్రల్లో నటించి టాలీవుడ్ ప్రేక్షకుల్లో కమెడియన్ గా తనకంటూ ఒక మంచి పేరు సంపాదించారు. అయితే ఆ తరువాత కూడా కొన్నేళ్లు కమెడియన్ గా పలు సినిమాల్లో నటించిన సునీల్, 

తొలిసారి ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా 2006లో వచ్చిన అందాల రాముడు సినిమాతో హీరోగా మారారు. హీరోగా చేసిన సినిమాతోనే అలరించే నటన మరియు డాన్సులతో అదరగొట్టి మంచి సక్సెస్ ని అందుకున్న సునీల్, ఆ తరువాత ఏకంగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మర్యాద రామన్న సినిమాలో హీరోగా నటించారు. అప్పట్లో ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచి సునీల్ కు హీరోగా మంచి సక్సెస్ ని అందించింది. ఆపై ఆయన నటించిన పూల రంగడు, అలానే నాగచైతన్యతో కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ తడాఖా కూడా బాగానే సక్సెస్ అయ్యాయి. అయితే ఆ తరువాత ఆయన హీరోగా నటిస్తున్న సినిమాలు వరుసగా పరాజయాల పాలవడంతో సునీల్ కెరీర్ కొంత డైలమాలో పడింది అనే చెప్పాలి. కొద్దిరోజుల క్రితం ఆయన, అల్లరి నరేష్ తో కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ, సిల్లీ ఫెలోస్ కూడా ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడంతో, ప్రస్తుతానికి హీరోగా నటించే సినిమాలు ప్రక్కన పెట్టారు సునిల్. 

ఇక ఆ తరువాత ఇటీవల ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ అరవింద సమేత ద్వారా కమెడియన్ గా మళ్ళి రిఎంట్రీ ఇచ్చారు సునిల్. అయితే ఆ సినిమా సూపర్ హిట్ తో సునీల్ కు కొంత కెరీర్ పరంగా కలిసివచ్చిందనే చెప్పాలి. అనంతరం అమర్ అక్బర్ ఆంటోనీ, పడి పడి లేచే మనసు, చిత్రలహరి వంటి సినిమాల్లో మంచి కామెడి పాత్రల్లో నడిచిన సునీల్, మంచి ఫామ్ లోకి రావడం జరిగింది. అయితే ఎవరికైనా ఒక్కోసందర్భంలో కెరీర్ పరంగా అపజయాలు తప్పవని, అయితే సునీల్ ప్రస్తుతం కమెడియన్ గా చేస్తున్నప్పటికీ, మధ్య మధ్యలో ఆయనకు హీరోగా ఇంకా అవకాశాలు వస్తున్నా, ఆయన మాత్రం ఆడియన్స్ ని అలరించే మంచి సబ్జెక్టు కోసం ఎదురుచూస్తున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే ఆ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియనప్పటికీ, ఒకవేళ నిజమే అయితే మాత్రం, మళ్ళి సునీల్ హీరోగా మంచి సినిమాల్లో నటించి ప్రేక్షకుల అలరించాలని కోరుకుందాం...!!   


మరింత సమాచారం తెలుసుకోండి: