టాలీవుడ్ లో గతంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో చాలానే సినిమాలు రావడం జరిగింది. అయితే అందులో కొన్ని మంచి సక్సెస్ సాధిస్తే, మరికొన్ని కథ,కథనాల్లో లోపాల వలన బోల్తాపడడం జరిగింది. ఇకపోతే క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ కౌసల్య కృష్ణమూర్తి, నిన్న ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. సీనియర్ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె ఎస్ రామారావు తనయుడు కేఎస్ వల్లభ నిర్మించడం జరిగింది. ఇటీవల తమిళ్ లో వచ్చిన కనా అనే సినిమాకు అధికారిక రీమేక్ గా రూపొందిన ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ఒక ముఖ్యపాత్రలో నటించగా, తమిళ నటుడు శివకార్తికేయన్ ఒక స్పెషల్ క్యారెక్టర్ లో నటించడం జరిగింది. అయితే ఫస్ట్ లుక్ టీజర్ దగ్గరినుండి మొన్నటి ట్రైలర్ రిలీజ్ వరకు ఆడియన్స్ లో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా, 

నిన్న రిలీజ్ అయి, ప్రస్తుతం మంచి సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతుంది. స్వతహాగా వ్యవసాయదారుడైన కృష్ణమూర్తికి క్రికెట్ అంటే ఎంతో ప్రేమ కలిగి ఉండడం, అయితే అనుకోకుండా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఇండియా ఓడిపోవడంతో అతడు ఎంతో బాధపడడంతో, తండ్రి బాధను చూసి, ఎలాగైనా తాను భవిష్యత్తులో మంచి క్రికెటర్ గా మారి, ఇండియా తరపున మ్యాచ్ అడి, తండ్రి కోరుకున్న విధంగా ఇండియాకు కప్ తీసుకురావాలని భావించి, కష్టపడి చివరకు క్రికెటర్ గా మారిన కౌసల్య అనే అమ్మాయి పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటించడం జరిగింది. అయితే క్రికెట్ తో పాటు, రైతులకు సంబందించిన ఒక మంచి అంశాన్ని తీసుకుని, రెండిటిని మిళితం చేస్తూ, ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా ఈ సినిమాను దర్శకుడు భీమనేని తెరకెక్కించారని అంటున్నారు సినిమా విశ్లేషకులు. నిజానికి ఈ సినిమాకు తాము మంచి సక్సెస్ టాక్ వస్తుందని భావించామని, 

అయితే నిన్న ఉదయం సినిమా రిలీజ్ అయిన దగ్గరినుండి సినిమా అద్భుతంగా ఉంది అంటూ, విపరీతమైన ఫోన్ కాల్స్ వస్తున్నాయని నిర్మాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారట. అయితే క్రికెట్ తోపాటు వ్యవసాయానికి సంబందించిన మెసేజీని కలగలిపి ఎంతో హృద్యంగా తెరకెక్కిన తమ సినిమాకు ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారని తాము భావించామని, కానీ కేవలం వారు మాత్రమే కాక, పిల్లలు, పెద్దలతో పాటు, యువత కూడా ఎక్కువగా తమ సినిమాను చూసేందుకు వస్తుండడం నిజంగా కొంత షాకింగ్ గా ఉన్నప్పటికీ, ఎంతో ఆనందదాయకం అని వారు అభిప్రాయపడుతున్నారట. అయితే రెండవరోజైన నేడు కూడా దాదాపుగా అన్ని చోట్ల సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోందని, సినిమాకు ఈ విధమైన కలెక్షన్స్ చూస్తుంటే రాబోయే రోజుల్లో మంచి హిట్ సినిమాగా నిలిచి, నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: