వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్న హీరో శర్వానంద్ ప్రస్తుతం 96 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మొన్న వచ్చిన "రణరంగం" సినిమా కొంత ఫర్వాలేదనిపించినా, కమర్షియల్ గా వర్కవుట్ అవలేదు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శర్వానంద్ గ్యాంగ్ స్టర్ గా నటించి అందరినీ అలరించాడు. నటన పరంగా శర్వానంద్ కి మంచి మార్కులే పడ్డప్పటికీ, సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు.


అయినా శర్వానంద్ జోరు తగ్గట్లేదు. ప్రస్తుతం శర్వా చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. తమిళంలో సూపర్ హిట్ అయిన 96 మూవీ తెలుగు రీమేక్ లో నటిస్తున్న శర్వానంద్ ఆ తర్వాత వరుసగా సినిమాలు చేయనున్నాడట. 96సినిమాలో హీరోయిన్ గా సమంత నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.తమిళంలో లో మ్యాజిక్ క్రియేట్ చేసిన ఈ సినిమా తెలుగులో ఏ విధంగా ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది.


ఈ సినిమా తర్వాత  తమిళంలో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట. అయితే  96  తర్వాత సినిమా  పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో శర్వా కనిపించనున్నాడని సమాచారం. ఆయన గతంలో చేసిన శతమానం భవతి మూవీ తరహాలో సాగే ఈ చిత్రం పూర్తిగా పల్లెటూరి నేపథ్యంలో సాగుతుందని సమాచారం.

శ్రీకరం అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని 14రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తుండగా, కిషోర్ రెడ్డి నూతన దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఐతే ఈ చిత్రంలో శర్వా రైతుగా కనిపించనున్నారని టాలీవుడ్ వర్గాలలో విశేషంగా వినిపిస్తున్న వార్త. ఎప్పుడూ లవర్ బాయ్ పాత్రలు చేసే శర్వా మొదటిసారి రైతుగా కనిపించనున్నారని తెలుస్తుంది. మరి ఈ సినిమా పట్టాలెక్కడానికి చాలా టైం పడుతుందని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: