టాలీవుడ్ లో తన ఆకట్టుకునే నటనతో నాచురల్ స్టార్ గా పేరు సంపాదించిన నాని, తొలి సినిమా అష్టాచమ్మా తోనే సూపర్ హిట్ ని సొంతం చేసుకున్నారు. ఇంద్రగంటి మోహన కృష్ణ తెరకెక్కించిన ఆ సినిమాలో నాని, ఎంతో పరిణితి గల నటుడిగా నటించి, అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక ఆ తరువాత వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని, ప్రస్తుతం కెరీర్ పరంగా మంచి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా రూపొందుతున్న గ్యాంగ్ లీడర్ వచ్చేనెల 13న రిలీజ్ కానుంది. 

నిజానికి ఈనెల 30న విడుదల కావలసిన ఈ సినిమా, సడన్ గా సాహో ను కూడా అదే రోజున రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడంతో, ఆ పోటీ నుండి గ్యాంగ్ లీడర్ తప్పుకొని, సెప్టెంబర్ 13కు వెళ్లడం జరిగింది. అయితే, సినిమా విడుదలకు ఇంకా కేవలం 20రోజులు మాత్రమే సమయం ఉన్నప్పటికీ, గ్యాంగ్ లీడర్ యూనిట్ పూర్తి స్థాయిలో సినిమా ప్రమోషన్ పై దృష్టిపెట్టినట్లు కనపడలేదని, కొన్నాళ్ల క్రితం ఫస్ట్ లుక్ టీజర్ ని, ఒక లిరికల్ సాంగ్ రిలీజ్ చేసిన సినిమా యూనిట్, ఇటీవల మరొక లిరికల్ సాంగ్ ని మాత్రమే రిలీజ్ చేసారని అంటున్నారు. అయితే అదే రోజున రిలీజ్ కానున్న వరుణ్ తేజ్, హరీష్ శంకర్ ల వాల్మీకి అప్పుడే టీజర్ తో పాటు సాంగ్స్ ను అలానే వీడియో సాంగ్ ప్రోమోలను కూడా రిలీజ్ చేసి మంచి జోష్ తో ముందుకుసాగుతోంది. 

అలానే మరొక పది రోజుల్లో ఆ సినిమా ప్రి రిలీజ్ వేడుక కూడా ఎంతో ఘనంగా జరుగనుందని సమాచారం. ఇక వాల్మీకి నుండి రిలీజ్ చేసిన జర్ర జర్ర మాస్ సాంగ్, ఇప్పటికే యూట్యూబ్ లో అదరగొడుతుండగా, మెగా ఫ్యాన్స్ ఫస్ట్ టైం మాస్ లుక్ లో అదరగొట్టిన వరుణ్ చూసి ఎంతో మురిసిపోతున్నారు. అయితే గ్యాంగ్ లీడర్ మెల్లగా ముందుకు సాగుతున్నదానిని బట్టి చూస్తుంటే, మరొక్కసారి ఆ సినిమా వాయిదా పడే అవకాశం కనపడుతోందనే అనుమానాలు కూడా ఫిలిం నగర్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికైనా గ్యాంగ్ లీడర్ నిర్మాతలు మేల్కొని, సినిమాను ఎంతవరకు ప్రమోట్ చేస్తారో చూడాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: