యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా చేయడానికి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న బడా బడా హీరోయిన్లు ఎగబడుతున్నారు. ‘బాహుబలి’ పుణ్యమా అంటూ ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ పక్కన నటిస్తే కచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ పెంచుకోవచ్చని చాలా మంది టాప్ హీరోయిన్లు ప్రభాస్ తో నటించడానికి సై అంటున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే ప్రభాస్ ఎప్పుడు ఒప్పుకుంటారా అని ఆశతో ఎదురు చూస్తున్నారు. చాలా మంది బాలీవుడ్ హీరోయిన్లు తమ ఇంటర్వ్యూలలో ప్రభాస్ పక్కన నటించాలని ఉందని చాలామంది ఓపెన్ గా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.


ఇదే క్రమంలో ప్రస్తుతం ప్రభాస్ నటించిన సాహో సినిమాలో ప్రభాస్ పక్కన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటించగా ఒక సాంగు లో మరో హాట్ బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండేజ్ స్టెప్పులు వేసిన సంగతి మనకందరికీ తెలిసిందే. ఇటువంటి నేపథ్యంలో కాజల్ అగర్వాల్ ప్రభాస్ తో నటించే అవకాశం వచ్చినా కానీ కావాలని చాన్స్ మిస్ చేసుకున్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి. మరి వచ్చిన వార్తల్లో నిజం ఎంతో తెలియదు కానీ సాహో సినిమాలో ఒక సాంగు లో ప్రభాస్ పక్కన కాజల్ తో షూట్ చేయాలని అనుకున్నారట.


దీనికోసం కాజల్ అగర్వాల్ ని కలవగా రెండు కోట్లు కాజల్ అడగడంతో వెంటనే నిర్మాతలు వెనక్కి తగ్గినట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్. దీంతో ఈ వార్త ఇటీవల బయటకు రావడంతో పెద్ద హాట్ టాపిక్ అయింది. గతంలో కాజల్ అగర్వాల్ ప్రభాస్ పక్కన డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు చేయడం జరిగింది. ఆ రెండు సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఆ చనువుతో యు.వి.క్రియేషన్స్ నిర్మాతలు ప్రభాస్ తో చేయాలని కాజల్ కి ఆఫర్ చేయగా ఆమె భారీ మొత్తం డబ్బులు అడగటంతో నిర్మాతలు వెనక్కి తగ్గినట్లు వార్తలు వినబడుతున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: