మనం ఫేమ్ విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్ లీడర్.  ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ చిత్రంలో మలయాళ  బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా , శరణ్య , లక్ష్మి  కీలక పాత్రల్లో కనిపించనున్నారు.  కాగా ప్రియాంక కు తెలుగులో ఇదే మొదటి సినిమా. ఈ చిత్రం నుండి ఇటీవల విడుదలైన  హొయినా హొయినా అనే సాంగ్ శ్రోతలను  ఆకట్టుకుంటుంది. 




ఇక ఈ చిత్రం యొక్క  ట్రైలర్ ను వినాయక చవితి కానుకగా  సెప్టెంబర్ 2న  విడుదలచేయనున్నట్లు సమాచారం.  అయితే  ఈ ట్రైలర్ గురించి అధికారిక ప్రకటన వెలుబడాల్సి వుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.  అయితే  ఈ చిత్రాన్ని  మొదటగా   ఈనెల 30 న విడుదలచేయాలనుకున్నారు కానీ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ సినిమా సాహో కూడా అదే రోజూ విడుదలకానుండడంతో  పోటీఎందుకని వాయిదావేశారు .




డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కుతున్న ఈ చిత్రం  సెప్టెంబర్ 13న విడుదలకానుంది. ఇక  అదే రోజు మెగా హీరో  వరుణ్ తేజ్ నటిస్తున్నయాక్షన్ ఎంటర్టైనర్  వాల్మీకి కూడా విడుదలకానుంది. మరి ఈరెండు సినిమాల్లో  బాక్సాఫీస్ వద్ద  ఏ సినిమా  ఫై చేయి సాధిస్తుందో చూడాలి.  ఇక  ఈఏడాది  సమ్మర్ లో  జెర్సీతో ప్రేక్షకులముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టిన  నాని ఈ గ్యాంగ్ లీడర్ కూడా అదే స్థాయిలో  విజయం సాధిస్తుందని  ధీమా గా వున్నాడు.  కాగా ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను   సరిగమ సినిమాస్ సొంతం చేసుకుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: