భారతీయ సినీ రంగంలో కొంత మంది పేర్లు ఇట్టే గుర్తు పడతారు. అది పాజిటీవ్ గా కావొచ్చు..నెగిటీవ్ గా కావొచ్చు.  ఒకప్పుడు హాలీవుడ్ లో ఫోర్న్ ప్రపంచాన్ని ఏలి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ గా కొనసాగుతున్న నటి సన్నీలియోన్ అంటే ఎవ్వరైనా గుర్తు పడతారు.  అలాంటిది అడల్ట్ మ్యాగజైన్ ప్లే బాయ్ లో న్యూడ్ గా ఫోజులిచ్చిన తొలి ఇండియన్ నటి షెర్లిన్ చోప్రా అప్పట్లో ఓ సెన్సేషన్ అయ్యింది.  కామసూత్ర సినిమాలో నటించిన ఈ భామ అందాల ఆరబోతకు సెన్సార్ వాళ్లే గుబులు పడ్డారు.

ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ సెక్సీ ఫోటోలు అప్ లోడ్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తుంది. గత కొంత కాలంగా ఆమె చేస్తున్న ఫోటో షూట్స్ పై అనేక విమర్శలు తలెత్తుతున్నాయి. ఈ మద్య షెర్లిన్ చోప్రా పెద్దగా ఎక్స్ పోజ్ కావడం లేదు.  ఈ హాట్ బ్యూటీ హైదరాబాదీ..అయితే మోడలింగ్ పై మక్కువతో ముంబాయి వెళ్లింది.  శృంగార తారగా  కామసూత్ర3డి మూవీలో  నటించి పెను సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది.  చాలా కాలం తర్వాత షెర్లిన్ చోప్రా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

ఈ ప్రస్తావనలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ పేరు కూడా ప్రస్తావించింది. గ్లామర్ ఫోటో షూట్స్ చేసినంత మాత్రాన అలాంటి మూవీల్లో అవకాశం వస్తుందని అనడం సరికాదు. ఇక అడల్ట్ సినిమాల్లో నటిస్తారా అన్న ప్రశ్నకు..అలాంటి సినిమాల్లో నటించడం అంత సులువు కాదని..ముఖ్యంగా అలాంటి సన్నీవేశాలు కెమెరా ముందు నటించడం చాలా కష్టమని చెప్పింది. కెమెరా ముందు గ్లామర్ షో, రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం వరకు అయితే ఒకే. కానీ  విచ్చలవిడిగా శృంగారం అంటే కష్టమే.  బోల్డ్ ఫోటో షూట్స్ వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అలాంటప్పుడు దీనిని వివాదం చేయడం ఎందుకు అని షెర్లిన్ అంటోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: