బాలకృష్ణ కెయస్ రవికుమార్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా కోసం తన లుక్ ను పూర్తిగా మార్చుకున్న విషయం తెలిసిందే. ఈమధ్యనే ఈసినిమాలోని బాలయ్య పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైన తరువాత ఆ ఫస్ట్ లుక్ లోని బాలకృష్ణ గెటప్ కు ఏకంగా నందమూరి అభిమానులే షాక్ అయిన విషయం తెలిసిందే. 

బాలకృష్ణ కొత్త లుక్ ను నిశితంగా పరిశీలించిన వారు మాత్రం ఈ మూవీలోని బాలయ్య లుక్ హాలీవుడ్ స్టార్  రాబర్ట్ డౌనీ జూనియర్ పోషించే టోనీ స్టార్క్ లుక్ ను గుర్తుకు తెస్తోంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరైతే బాలయ్య మార్చుకున్న లుక్ తో యంగ్ హీరోలకు సవాల్ విసురుతున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఏది ఎలా ఉన్నా బాలకృష్ణ కొత్త లుక్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఇది ఇలా ఉండగా ఈ లుక్ తో బాలకృష్ణ ఎయిర్ పోర్ట్ లో చేసిన ఒక విచిత్ర ఫీట్ గురించి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోలో బాలయ్య వైట్ కలర్ స్టైలిష్ బ్లేజర్ ధరించి ఎయిర్ పోర్ట్ లో నడుస్తూ రావడం తన సూట్ కేసును దూరంగా జరపడం మళ్ళీ దానికి ఒక మ్యాజిక్ లాగా ఒక దారం సహాయంతో దగ్గరకు లాక్కోవడం వంటి విన్యాసాలు చూసినవారు బాలయ్య మెజీషియన్ గా మారిపోయాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

మరికొందరైతే ఇది అంతా కెయస్ రవికుమార్ సినిమాలోని ఒక సీన్ కోసం బాలకృష్ణ చేసిన విన్యాసం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమాను రాబోతున్న సంక్రాంతి రేస్ లో నిలబెట్టాలని ప్రయత్నించినా ఈమూవీ షూటింగ్ మొదలు పెట్టడం ఆలస్యం అవ్వడంతో ఈమూవీ ప్రస్తుతం సంక్రాంతి రేస్ నుండి తప్పుకున్నట్లే అన్న ప్రచారం జరుగుతోంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: