స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలైన రామ్ చరణ్, ఎన్టీయార్ హీరోలుగా తెరకెక్కుతోంది ఆర్ ఆర్ ఆర్ సినిమా. దాదాపు 400 కోట్ల రుపాయల బడ్జెట్ తో డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. 2020 జులై నెల 30 వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ నటిస్తుండగా ఎన్టీయార్ సరసన విదేశీ భామ ఎంపికయినట్లు తెలుస్తుంది. ఈ విదేశీ భామ వివరాలు త్వరలోనే ప్రకటిస్తారని సమాచారం. 
 
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో ఎన్టీయార్ కొమరమ్ భీమ్ పాత్రలో నటిస్తున్నారు. ఎన్టీయార్ కొమరమ్ భీమ్ పాత్ర ఫస్ట్ లుక్ అక్టోబర్ 22 వ తేదీన విడుదల చేయబోతున్నారని తెలుస్తుంది. అక్టోబర్ 22 వ తేదీ కొమరమ్ భీమ్ జన్మించిన రోజు. కొమరమ్ భీమ్ జన్మదినం సందర్భంగా ఎన్టీయార్ ఫస్ట్ లుక్ విడుదల చేయాలని దర్శకుడు రాజమౌళి భావిస్తున్నాడని తెలుస్తుంది. 
 
కొమరమ్ భీమ్ ఫస్ట్ లుక్ తో రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రమోషన్లు మొదలుపెడతాడని తెలుస్తుంది. ఆ తరువాత సినిమాల్లోని ముఖ్య పాత్రల ఫస్ట్ లుక్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతాయని సమాచారం. ఎన్టీయార్, రామ్ చరణ్ ఇద్దరి పాత్రల్ని రాజమౌళి సమానంగా తీర్చిదిద్దాడని తెలుస్తుంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాకు థియేట్రికల్ రైట్స్ కోసం భారీగా ఆఫర్లు వస్తున్నాయి కానీ సినిమా విడుదలకు కొన్ని నెలల ముందు వరకు రైట్స్ ఎవరికీ అమ్మవద్దని నిర్మాతకు రాజమౌళి చెప్పాడని తెలుస్తోంది. 
 
కొమరమ్ భీమ్ పాత్రలో ఎన్టీయార్ ఫస్ట్ లుక్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల కాబోతుందని వార్తలు వచ్చాయి. ఎన్టీయార్ ఫ్యాన్ ఒకరు ఫస్ట్ లుక్ ఆగష్ట్ 14 వ తేదీన విడుదల చేస్తారని పోస్టర్ ఒకటి క్రియేట్ చేసి ఆన్ లైన్లో వదలటంతో ఫస్ట్ లుక్ విడుదలవుతుందనే చాలా మంది భావించారు. బాహుబలి సిరీస్ తో కొత్త ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసిన రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బాహుబలి రికార్డులను చెరిపేసి కొత్త రికార్డులు సృష్టిస్తాడని రాజమౌళి ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: