తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 కి మంచి ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా శని, ఆదివారంల్లో అక్కినేని నాగార్జున ఎంత సింపుల్ గా ఎంట్రీ ఇచ్చి అంత గ్రాండ్ గా ఎంట్రటైన్ మెంట్ చేస్తున్నారు.  వెరైటీ స్కిట్స్, కొత్త కొత్త టాస్క్ లు, చిన్న చిన గొడవలు, అలగడాలు, గిల్లి కజ్జాలు ఇవన్నీ బిగ్ బాస్ ఇంట్లో సహజమే..కానీ ఈసారి మాత్రం అంత తీవ్ర స్థాయిలో లేవనిపిస్తుంది. అప్పుడప్పుడు ఇంటి సభ్యులు గొడవపడ్డా వెంటనే కలిపిపోతున్నారు.  కాకపోతే మొదటి వారం తర్వాత రెండు వారాలు మాత్రం తమన్నా సింహాద్రి ఉన్నపుడు గరం గరంగా నడిచింది.

అయితే బిగ్ బాస్ లో సీజన్ వన్ నుంచి లీకేజీల గోల బాగా ఉంటు వస్తుంది.  రెండో సీజన్ అయితే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో ఖచ్చితంగా చెప్పేవారు..దానికి కారణం కౌశల్ ఆర్మీ.  తాజాగా బిగ్ బాస్ 3 సీజన్ కి కూడా లీకేజీల గొడవ తప్పడం లేదు.   ఈ వారం బాబా భాస్కర్, హిమజ, రాహుల్, పునర్నవి, మహేష్, అషు రెడ్డి, శివ జ్యోతి నామినేషన్ లో ఉన్నారు. వీరిలో రాహుల్ నామినేషన్ లో ఉన్న ప్రతి సారి ఎలాగోలా గట్టెక్కుతున్నాడు. ఇక శివజ్యోతి ఎలాగూ కెప్టెన్ అయినందున సేఫ్ జోన్ లో ఉండొచ్చు.

బాబా భాస్కర్, పునర్నవి, మహేష్, హిమజ లకు ఆడియన్స్ నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పుడు అందరి చూపు అషుపైనే ఉంది.  అషూ రెడ్డి సెలబ్రెటీ కాదు..అందులోనూ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి పెద్దగా యాక్టీవ్ గా ఉండటం లేదు. చాలా సున్నితంగా ప్రవర్తించడం జరుగుతుంది. ఆడియన్స్ మహేష్, హిమజ, బాబా భాస్కర్ ని సేవ్ చేసే క్రమంలో అషుకు ఓట్లు తగ్గాయనే చర్చ కూడా జరుగుతోంది.

మరోవైపు బిగ్ బాస్ 3 లో సర్ ప్రైజ్ ఉండబోతుందట. ఆదివారం ఎలినేట్ అయిన తర్వాత ఓ హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతుందట..ఆ హీరోయిన్స్ పేర్లు కూడా లీక్ అయ్యాయి. శ్రద్దా దాస్, ఇషా రెబ్బా, హెబ్బా పటేల్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇది కేవలం వైరల్ అవుతున్న వార్తలు మాత్రమే..రియాల్టీ ఏంటో ఆదివారం వరకు వేచి చూడాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: