ప్రస్తుతం తెలుగు టెలివిజన్ తెరపై మంచి రేటింగ్స్ తో, అలానే ప్రేక్షకాధరణతో దూసుకుపోతున్న బిగ్ బాస్ షో మంచి రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకు జరిగిన రెండు సీజన్స్ లో మొదటి సీజన్ కు ఎన్టీఆర్, రెండవ సీజన్ కు నాని, హోస్టులుగా వ్యవహరించి షో ను మంచి సక్సెస్ఫుల్ గా ముందుకు నడిపిస్తే, ప్రస్తుతం ప్రసారం అవుతున్న మూడవ సీజన్ కు కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తూ, షో ఖ్యాతిని మరింత పెంచుతున్నారు అనే చెప్పవచ్చు. అయితే మధ్యలో కొద్దిపాటి వివాదాలు ఈ షోను చుట్టుముట్టినప్పటికీ, 

వాటన్నిటినీ తట్టుకుని ప్రస్తుతం షో,ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతోంది. ఇకపోతే ఇప్పటికే షో నుండి హేమ, జాఫర్, తమన్నా, రోహిణి తదితరులు బయటకు వెళ్లగా, మిగిలిన సభ్యుల్లో ఈ వారం ఎలిమినేషన్ జోన్ లో ఉన్న పునర్నవి, హిమజ, ఆషురెడ్డి, రాహుల్, బాబా భాస్కర్, మహేష్ విట్టాతో పాటు శివజ్యోతి ఉన్నారు. అయితే ఈ ఏడుగురిలో రాహుల్, ఆషురెడ్డి, మహేష్ విట్టా లకు ఒకింత తక్కువ శాతం ఓట్లు నమోదవుతున్నాయని, ఇక ఆ ముగ్గురిలో కూడా ఆషు రెడ్డికి మరింతగా తక్కువ వోటింగ్ నమోదవుతున్నట్లు సమాచారం. దానిని బట్టి, ఈ వారం బిగ్ బాస్ షో నుండి బయటకు వెళ్ళేది అషు రెడ్డి అనే వినికిడి. 

అయితే షోలో మొదటి నుండి కూడా అషు పెద్దగా యాక్టివ్ గా లేకపోవడం, అదీకాక బిగ్ బాస్ ఇస్తున్న టాస్కుల్లో ఆమె అంతగా ఆసక్తిగా పార్టిసిపేట్ చేయకపోవడం కూడా ఆమెకు ప్రేక్షకుల నుండి నెగటివిటీ పెరిగి తక్కువ వోటింగ్స్ వచ్చేలా చేస్తున్నాయనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నట్లు నిజంగా అషు రెడ్డి ఎలిమినేట్ అవుతుందో లేదో తెలియాలంటే మాత్రం, మరి కొన్ని గంటలు వెయిట్ చేయక తప్పదు. ఇక ఈ వారమే షోలోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఉండే అవకాశం కూడా ఉందని కూడా అంటున్నారు.....!


మరింత సమాచారం తెలుసుకోండి: