టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత ఏడాది సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించిన నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలో హీరోగా నటించడం జరిగింది. అయితే ఆ సినిమా అప్పట్లో ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయి, బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అయితే తప్పకుండా తన ఫ్యాన్స్ కు తదుపరి సినిమాతో మంచి హిట్ ఇవ్వాలని భావించిన బన్నీ, ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. 

మంచి రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రివిక్రమ్ మార్క్ పంచులు ఈ సారి మరింతగా అదిరిపోతాయని టాక్. ఇక ప్రస్తుతం ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. ఇకపోతే తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఎప్పటికపుడు తన పర్సనల్, ఫ్యామిలీ మరియు సినిమాలకు సంబందించిన విషయాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకునే బన్నీ, నేడు తాను కొనుగోలు చేసిన కొత్త రేంజ్ రోవర్ కారుకు బీస్ట్ అనే పేరు పెట్టి, దానితో కలిసి ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేయడం జరిగింది. 

అంతేకాదు, నాకు ఎప్పుడు, ఏ వస్తువును కొనుగోలు చేసినా, నా మెదడుకు ఒక్క విషయం మాత్రం జ్ఞప్తికి వస్తుంది, అదే కృతజ్ఞత అంటూ, ఆ ఫోటోతో పాటు బన్నీ ఈ క్యాప్షన్ ని పోస్ట్ చేసారు. ఇక ఫోటో బన్నీ పోస్ట్ చేసిన వెంటనే, ఆయన ఫ్యాన్స్ దానిని విపరీతంగా పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా షేర్స్, లైక్స్ తో వైరల్ చేస్తున్నారు. స్వతహగా కార్లు అంటే ఎంతో ఇష్టం ఉన్న బన్నీ, ఇటీవల ఒక క్యారవాన్ ని కొనుగోలు చేసి, దానికి ఫాల్కన్ అనే పేరు కూడా పెట్టడం జరిగింది. ఇక ఇప్పుడు ఈ సరికొత్త రేంజ్ రోవర్ కొనుగోలుతో ఆయన గ్యారేజ్ లోకి బీస్ట్ న్యూ ఎంట్రీ ఇచ్చిందన్నమాట....!!


మరింత సమాచారం తెలుసుకోండి: