అల్లు అర్జున్,నిర్మాత అల్లు అరవింద్ కుమారునిగా సినిమా ఇండ్రస్ట్రీకి పరిచయమైన అనతికాలంలో తనకంటూ ఓ ఇమేజ్‌ను స్వంతం చేసుకున్నాడు.ఇక గత కొన్నాళ్ళగా సైలెంట్ గా ఉన్న అల్లు అర్జున్ ఒక్క సారిగా స్పీడ్ పెంచాడు.ఏడాది పైగా గ్యాప్ తీసుకున్న ఆయన ఇప్పుడు వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం ఈ అల్లువారబ్బాయి నటిస్తున్న తాజాచిత్రం' అల..వైకుంఠపురములో ముచ్చటగా మూడో సారి ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నారు.వీరిద్దరిది సూపర్ హిట్ కాంబినేషన్ అనే పేరుంది..అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో ఇప్పటికే జులాయి,సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు వచ్చాయి.దీనితో అల..వైకుంఠపురములోపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.చివరగా అల్లు అర్జున్ నటించిన చిత్రం నా పేరు సూర్య ఇది ప్రేక్షకులను నిరాశపరిచింది.



ప్రస్తుతం నటిస్తున్న అల.. వైకుంఠపురములో,చిత్రం ఫుల్ జోష్ నింపుతుందని గుసగుసలు.ఇక ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని,గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండగా ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.ఇక హీరోలల్లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన స్టార్లలో బన్నీ ఒకడు.అంతేకాకుండా బన్నీ సోషల్ మీడియాలో ఎప్పుడు అభిమానులతో చేరువగా ఉంటాడు.తాజాగా బన్నీ ఓ ట్వీట్ చేస్తూ తాను కొత్త రేంజ్ రోవర్ కారు కొన్న విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు.'మా ఇంట్లోకి కొత్త కారు వచ్చింది.దానికి నేను 'బీస్ట్' అని పేరు పెట్టా.నేను ఏ వస్తువు కొన్నా దానిని కృతజ్ఞతగానే భావిస్తా'అని బన్నీ ట్వీట్ చేశాడు.స్వతహాగా కార్ ప్రియుడు అయిన బన్నీ ఈమధ్యనే ఒక కార్ వ్యాన్ ని కొనుగోలు చేసి,దానికి ఫాల్కన్ అనే పేరు కూడా పెట్టుకున్నారు. ఇక ఇప్పుడు ఈ సరికొత్త రేంజ్ రోవర్ కారు ఆయన గ్యారేజ్ లోకి ఎంట్రీ ఇచ్చిందన్నమాట.



ఇతర హీరోలతో పోలిస్తే బన్నీ ప్రత్యేకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాడు.తను వాడే ప్రాపర్టీస్ అన్నీ కూడా స్టైలిష్ గా ఉండేలా చేసుకుంటాడు.ముఖ్యంగా అతడి కార్ వ్యాన్ ని ముంబైకి చెందిన ఓ వ్యక్తితో ప్రత్యేకంగా తయారు చేయించుకున్నాడట.మూడు కోట్లు పెట్టి ఇంటీరియర్ డెకరేషన్ చేయించుకోగా..ఈ వ్యాన్ ధర రూ.7 కోట్లకు పైమాటే అంటున్నారు. ఇంత లగ్జరీ కార్ వ్యాన్ ని దేశంలో ఏ హీరో వాడడం లేదని అంటున్నారు.ఇకపోతే ఇప్పుడుకొన్న కారు రేటు సుమారుగా 1కోటి వరకు వుంటుందని చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: