రాజకీయాలపై ఏర్పడిన విరక్తితో ప్రస్తుతం చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటూ తన సినిమాల పైనే పూర్తిగా దృష్టి పెడుతున్నాడు. ఇలాంటి పరిస్థితులలో చాలాకాలం తరువాత ఒక బహిరంగ కార్యక్రమం కోసం పశ్చమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం వస్తాడని తెలియడంతో మెగా అభిమానులు భారీ ఏర్పాట్లు చేసారు. 

వాస్తవానికి చిరంజీవి ఈరోజు ఉదయం తాడేపల్లి గూడెం వచ్చి మహానటుడు ఎస్.వి. రంగారావు కాంస్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనవలసి ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి తాడేపల్లి గూడెంలోని ఎస్.వి.ఆర్ సర్కిల్ లో ఈ కాంస్య విగ్రహాన్ని పెట్టడానికి భారీ ఏర్పాట్లు చేసారు. అయితే ఈరోజు జరగవలసిన ఈ కార్యక్రమం చివరి నిముషంలో క్యాన్సిల్ కావడంతో చిరంజీవి తాడేపల్లి గూడెం పర్యటన వాయిదా పడింది. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న నిర్వాహుకులకు ఈ కార్యక్రమ అనుమతులు లభించలేదని తెలుస్తోంది. దీనితో ఈ విగ్రహం ఏర్పాటు చేసే స్థలంలో వివాదాలు ఉన్నాయా లేదంటే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకు స్థానిక రాజకీయ నాయకులకు అభిప్రాయ భేదాలు ఉన్నాయా అన్న సందేహాలు కలుగుతున్నాయి. 

వాస్తవానికి పశ్చమ గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గ యువత మెగా ఫ్యామిలీ పై ఎప్పుడు చాల విపరీతమైన ప్రేమను కురిపిస్తూ ఉంటుంది. దీనితో చిరంజీవి పర్యటనను మెగా స్టామినా తెలిపే విధంగా అత్యంత భారీ ఏర్పాట్లు చేసి భారీగా ప్రచారం కూడ చేసారు. ‘సైరా’ టీజర్ కు అనూహ్య స్పందన రావడంతో చిరంజీవికి భారీ స్వాగతం పలికి గోదావరి జిల్లాలలో మెగా అభిమానుల బలం అందరికీ తెలిసి వచ్చేలా చేయాలి అనుకున్న బల ప్రదర్శనకు రాజకీయాలు అడ్డు రావడంతో మెగా అభిమానులు నిరాశలో ఉన్నట్లు టాక్..



మరింత సమాచారం తెలుసుకోండి: