శనివారం బిగ్ బాస్ లో వెన్నుపోటు దారులెవరో, శత్రువులెవరో తెలియజేయాలని ఒక గేమ్ ఆడించారు. ఇక్కడ అందరినీ ఆకర్షించింది వెన్నుపోటుదారుడనే పాయింట్ ఒక్కటే. బిగ్ బాస్ లో ఇప్పటి వరకు తమతో స్నేహంగా ఉంటూ, వెన్నుపోటు పొడిచిన వారి గురించి చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ వెన్నుపోటు దారుడినెవరూ సిరియస్ గా తీసుకోనప్పటీకీ ఒక నలుగురికి మాత్రం చాలా సీరియస్ అయింది. 


బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుండి చెక్కు చెదరకుండా ఉన్న ఆ నలుగురిలో ఒకరికి వీడియో బైట్ చూపించి బిగ్ బాస్ చిచ్చు పెట్టాడు.అది మెల్లగా ఇప్పుడిప్పుడే పాకుతూ వస్తుంది. శనివారం ఇది తేటతెల్లమైంది. పునర్నవి తన వెన్నుపోటు పొడిచే వ్యక్తిగా వితికాని, శత్రువుగా వరుణ్ ని చూపించింది. అయితే దీనికి వరుణ్ కౌంటర్ గా పునర్నవిని వెన్నుపోటుదారుగా చూపించాడు. అలా చూపించడానికి గల కారణాన్ని వరుణ్ చాలా క్లుప్తంగా చెప్పి అందరిచేత ఆహా అనిపించాడు.


ముఫ్పై రోజుల నుండి స్నేహం చేస్తున్న దాని కంటే, రెండు నిమిషాల వీడియోనే ఎక్కువ నమ్ముతుందని, అది చూసినప్పటి నుండే ఆమె ప్రవర్తన ఇలా అయిందని అది తనకి నచ్చలేదని చెప్పాడు.ఫ్రెండ్ గా ఉన్నప్పుడు వాళ్ళ మధ్య ర్యాపో చాలా బాగుందని, ఆ విషయాలేవీ పట్టించుకోకుండా వీడియోలో చూపించింది మాత్రమే తీసుకుందని చెప్పాడు.వరుణ్ చాలా క్రిస్టల్ క్లియర్ గా తను చెప్పదల్చుకున్న దాన్ని అందరికీ కన్వే చేశాడు.


అతను చెప్పినది వాదన లాగా కాకుండా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చడంలో సక్సెస్ అయ్యాడు. నేను అందరితో స్నేహంగా ఉంటాను. అన్ని విషయాలు షేర్ చేసుకుంటాను, వితికా కి నాకు ర్యాపో ఎక్కువ కాబట్టి మరిన్ని విషయాలు షేర్ చేసుకుంటాను దాన్లో తప్పే లేదని బల్లగుద్ది చెప్పాడు. చెప్పింది కొంతే అయినా క్లుప్తంగా, అందరికి అర్థమయ్యేలా చెప్పడంలో వరుణ్ సక్సెస్ అయ్యాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: