యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్ ఆర్ ఆర్'. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో తారక్, కొమరం భీం పాత్రలో, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను 2020 జూలై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.


తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్ ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఈ సినిమా గురించి ఎలాంటి వార్త బయటకు రాలేదు. దీంతో అటు నందమూరి అభిమానులు, ఇటు మెగా ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏదైనా ఒక పోస్టర్ విడుదల చేయాలని చిత్ర దర్శకుడు రాజమౌళి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం  ఇందుకు సంబంధించిన పనులను కూడా చేస్తున్నాడని టాక్.


ప్రమోషన్లలో ఎప్పుడూ ముందుండే రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ గురించి అప్ డేట్స్ ఇచ్చే పనిలో పడ్డాడట. ఒక్కోటి రివీల్ చేసుకుంటూ అభిమానుల్లో హైప్ క్రియేట్ చేయడానికి సిద్ధం అవుతున్నాడట. బాహుబలికి ఆయన చేసిన ప్రమోషన్స్ గురించి అందరికీ తెలిసిందే. దీంతో ఆర్ ఆర్ ఆర్ కి కూడా అలానే చేద్దామని డిసైడ్ అయ్యాడట. షూటింగ్ మొదలెట్టినప్పటి నుండే అభిమానుల్ని భాగం చేయడం మంచిదని భావించాడట.


ఇందులో భాగంగానే కొమరం భీంగా కనిపించనున్న జూనియర్ ఎన్టీఆర్ లుక్‌ను త్వరలోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ పోస్టర్‌ను అక్టోబర్ 22న విడుదల చేస్తారట. ఆరోజు కొమరం భీం జయంతి ఉండడమే దానికి కారణం అని అంటున్నారు. దీంతో నందమూరి అభిమానులు ఖుషీ అయిపోతున్నారు. మరోవైపు, ఈ సినిమా కోసం తారక్ ఎంతగానో కష్టపడుతున్నాడు. సరైన ఫిజిక్ కోసం గంటల తరబడి జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: