బాలీవుడ్ బాద్షాహ షారుక్ ఖాన్  చివరి సినిమా జీరో ఘోరపరాజయం అయ్యింది. ఆ సినిమా విడుదల అయ్యి ఎనిమిది నెలలు అవుతున్న కూడా షారుక్ ఖాన్ కొత్త సినిమా ఒప్పుకోలేదు. ఈ గ్యాప్ లో షారుక్ ఖాన్ చిత్ర నిర్మణంపై ఎక్కువ ఫోకాస్ చేస్తున్నారు.జాన్ అబ్రహమ్ హీరో గా నటించిన బద్ల సినిమా ను అతడి సతీమణి గౌరి ఖాన్ తో కలిసి ప్రోడ్యూస్ చేశారు.
ప్రస్తుతం షారుక్ ఖాన్ నెట్ ఫ్లిక్స్ ఇండియతో కలిసి  ‘బార్డ్ ఆఫ్ బ్లడ్’ వెబ్ సిరీస్ నిర్మిస్తున్నరు.  బార్డ్ ఆఫ్ బ్లడ్’ వెబ్ సిరీస్ లో ఇండియాన్ స్పై ఏజెంట్స్ అనుకొని పరిస్థితిలో పాకిస్థాన్ వెళ్లి  ఉగ్రవాదులను చంపుతారు .ఇప్పటికే ఇండియ-పాకిస్థాన్ మధ్యలో పరిస్థితులు కొత్త రంగులు పులుకుంటున్నాయి.ఈ నేపథ్యంలో షారుక్ ఖాన్ విడుదల చేసిన వెబ్ సిరీస్ ట్రేలర్ తీవ్ర దుమారం రేపింది.ఈ ట్రేలర్ పై ఆర్మి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూల్ ట్విట్టర్ లో తీవ్రంగా స్పందించారు.తమరు ఇంకా బాలీవుడ్ భ్రమలోనే బతుకుతున్నారని - రియాలిటీ తెలియాలంటే ‘రా’ గూఢాచారి కుల్ భూషణ్ జాదవ్ - వింగ్ కమాండర్ అభినందన్ - 27 ఫిబ్రవరి 2019న భారత్-పాకిస్తాన్ సరిహద్దు వివాదాన్ని గమనించాని .అలాగే తమరు జమ్మూ కశ్మీర్ లో జరుగుతున్న దురాగతాలకు వ్యతిరేకంగా గళమెత్తి.. శాంతిని ప్రోత్సహించాలని - నాజీలుగా మారిన హిందుత్వ ఆరెస్సెస్ నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడితే బాగుంటుందని ట్విట్ చేశారు. 
  బార్డ్ ఆఫ్ బ్లడ్’ వెబ్ సిరీస్ బిలాల్ సిద్దిఖీ రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించబడుతుంది, ఇందులో ఇమ్రాన్ హస్మి,వినీత్ సూమార్ సింగ్,శోభితా ధూళిపాల (గూఢాచారి ఫేమ్) ప్రధాన పాత్రదారులుగా నటిస్తున్నారు. ఇది ఒక ప్రేమ,ప్రతీకారం గూఢచార్యం,డ్యూటి మధ్య సాగే ఓ ఉత్కంఠభరితమైన కథ. ఈ వెబ్ సిరీస్ సెప్టబర్ 27 నుండి నెట్ ఫిక్స్ లో ప్రసారం అవుతుంది


మరింత సమాచారం తెలుసుకోండి: